https://oktelugu.com/

పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1000 డిస్కౌంట్..?

దేశంలో చాలామంది సొంత ఇల్లు లేకపోవడం వల్ల అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి అద్దె ధరలు భారీగా పెరుగుతుండటంతో అద్దె ఇళ్లలో నివసించే వాళ్లు ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించాల్సి వస్తోంది. అయితే డిజిటల్ లావాదేవీల యాప్ లలో ఒకటైన పేటీఎం యాప్ అద్దె చెల్లించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పించింది. Also Read: పన్ను చెల్లింపుదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఫ్రీగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 / 08:25 AM IST
    Follow us on


    దేశంలో చాలామంది సొంత ఇల్లు లేకపోవడం వల్ల అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం సంవత్సరానికి అద్దె ధరలు భారీగా పెరుగుతుండటంతో అద్దె ఇళ్లలో నివసించే వాళ్లు ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించాల్సి వస్తోంది. అయితే డిజిటల్ లావాదేవీల యాప్ లలో ఒకటైన పేటీఎం యాప్ అద్దె చెల్లించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పించింది.

    Also Read: పన్ను చెల్లింపుదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆ సర్వీసులు..!

    పేటీఎం క్రెడిట్ కార్డును ఉపయోగించి రూమ్ రెంట్ ను చెల్లించడం వల్ల ఈ క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం యాప్ ను వాడుతున్న కస్టమర్లు ఈ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇంటి అద్దె చెల్లించే వారికి ప్రయోజనం చేకూర్చేందుకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం యాప్ లో ఈ ఆఫర్ యూజర్లకు కనిపిస్తోంది.

    Also Read: సీఎంలు, పీఎంల వెనుకాల సెక్యూరిటీ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు?

    అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే మంచిది. అయితే ఈ ఆఫర్ ను పొందాలనుకునే వారి సాధారణంగా చెల్లించే ఇంటి మొత్తాన్ని ఓనర్ కు జమ చేయాల్సి ఉంటుంది. ఇంటి రెంట్ జమ చేసిన వాళ్లు స్క్రాచ్ కార్డ్ ద్వారా ఈ ఆఫర్ ను పొందవచ్చు. పేటీఎం క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల పేటీఎం యూజర్లకు మరో అదనపు ప్రయోజనం కూడా కలగనుంది.

    మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం

    క్రెడిట్ కార్డ్ ద్వారా రూమ్ రెంట్ చెల్లిస్తే అకౌంట్ లో ఉన్న డబ్బులను ఇతర అవసరాలకు కూడా వాడుకునే అవకాశం ఉంది. ఇలా పేటీఎం క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటి అద్దె చెల్లించే పేటీఎం వినియోగదారులు పేటీఎం క్రెడిట్ కార్డును తీసుకుంటే ఇతర ఆఫర్ల ద్వారా ఎక్కువ మొత్తం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.