https://oktelugu.com/

బ్రేకింగ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు కరోనా పాజిటివ్

సినిమా ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చాలా మందిని కరోనా కబళించింది. మొన్న ఈ మధ్యే ఎస్పీ బాలు కరోనా సోకి అనంతరం కోలుకోకుండా అసువులు బాసారు. ఇక రాజశేఖర్ లాంటి హీరో కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ ! తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. […]

Written By: , Updated On : December 29, 2020 / 08:28 AM IST
Follow us on

Ram Charan COVID 19

సినిమా ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చాలా మందిని కరోనా కబళించింది. మొన్న ఈ మధ్యే ఎస్పీ బాలు కరోనా సోకి అనంతరం కోలుకోకుండా అసువులు బాసారు. ఇక రాజశేఖర్ లాంటి హీరో కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !

తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది మెగా ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అభిమానులు దీనిపై ఆరా తీస్తున్నారు. రాంచరణ్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

రాంచరణ్ ఇటీవల నిహారిక పెళ్లితోపాటు క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు బయటపడ్డట్టు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా ఫలితాల్లో పాజిటివ్ గా తేలిందని తెలిసింది.

Also Read: “షకీలా” సినిమా ఎలా ఉందంటే ?

ప్రస్తుతం రాంచరణ్ కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. హోం క్వారంటైన్ లో ఉన్నానని పేర్కొన్నాడు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని రాంచరణ్ కోరాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్