https://oktelugu.com/

సీఎంలు, పీఎంల వెనుకాల సెక్యూరిటీ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు?

రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ఇంకా.. ఇతరత్రా రాజకీయ, రాజ్యాంగ ప్రముఖుల వెనుకలా ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటారు. ప్రత్యేక దుస్తులు ధరించిన ఈ హైసెక్యూరిటీ పోలీసులు లేదా సైనికులు ప్రత్యేకమైన కళ్లద్ధాలు పెట్టుకుంటారు. టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్ తో, నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని ఎప్పుడూ నేతల వెనుకాలే నిలబడి ఉంటారు. అయితే.. వాళ్లు నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దానివెనుక పెద్ద కథే ఉంది. Also Read: బీజేపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2020 / 09:01 PM IST
    Follow us on

    రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి. ఇంకా.. ఇతరత్రా రాజకీయ, రాజ్యాంగ ప్రముఖుల వెనుకలా ఎప్పుడూ టైట్ సెక్యూరిటీ ఉంటారు. ప్రత్యేక దుస్తులు ధరించిన ఈ హైసెక్యూరిటీ పోలీసులు లేదా సైనికులు ప్రత్యేకమైన కళ్లద్ధాలు పెట్టుకుంటారు. టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్ తో, నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని ఎప్పుడూ నేతల వెనుకాలే నిలబడి ఉంటారు. అయితే.. వాళ్లు నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దానివెనుక పెద్ద కథే ఉంది.

    Also Read: బీజేపీ సీఎం అభ్యర్థి సౌరభ్ గంగూలీయేనా?

    సెక్యూరిటీ పర్సన్స్ కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం ఎంత మాత్రం కాదు. ఆ కళ్లద్దాల వెనుక చాలా పెద్ద సీక్రెట్ ఉంది. నేతలు బహిరంగ సభలు, మీటింగులకు వెళ్లడమంటే జనాల్లోకి పోవడమే. ఆ జనాల్లో అభిమానులతోపాటు శత్రువులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారందరిపై సెక్యూరిటీ గార్డ్స్ కన్నేసి ఉంచాలి. అంటే.. ఆ జనాభా మొత్తాన్ని వీరు తీక్షణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఎవరైనా అనుమానాస్పందంగా తిరుగుతున్నారా? మరేవైనా కదలికలు చేపడుతున్నారా? అని నిశితంగా గమనించాలి. వేదికపై నిలబడి సెక్యూరిటీ అలా నలువైపులా తమ కళ్లు తిప్పుతూ ఉంటే.. ఎదురుగా జనాల్లో ఉన్న శత్రువులకు వారి మూమెంట్ క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అంటే.. సెక్యూరిటీ పర్సన్ ఎటువైపు చూస్తున్నారు? ఎవరిని గమనిస్తున్నారు? అన్న విషయం ఎదుటివారికి తేలిగ్గా అర్థమవుతుంది? ఎవరినైనా అనుమానంగా చూస్తున్నారా? అనేది కూడా తెలిసిపోతుంది. అది తెలిసిందంటే.. శత్రువు వెంటనే జాగ్రత్త పడిపోతాడు.

    శత్రువు జాగ్రతపడ్డాడంటే.. సెక్యూరిటీ నుంచి మిస్సయిపోతాడు. అదే జరిగిందంటే.. ఆ తర్వాత జరగబోయే నష్టం ఒక్కోసారి ఊహకందదు. ఇలా.. ఎమ్మెల్యే నుంచి ప్రధాన మంత్రి దాకా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. కాబట్టి.. సెక్యూరిటీ అనుక్షణం పకడ్బందీగా కాపలా కాయాల్సి ఉంటుంది. శత్రువుల కదలికలను పసిగట్టడంతోపాటు.. తమ పరిశీలనను వారికి అందకుండా చూడాలి. అంటే.. తామేం చేస్తున్నామో వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అలా చేయాలంటే కళ్ల కదలికలు అగుపించకుండా చేయాలి. అది జరగాలంటే.. కళ్లద్దాలు పెట్టుకోవాల్సిందే. అవి కూడా కారు చీకటిలాంటి నలుపు అద్దాలనే ఉపయోగించాలి. ఈ కోణంలోనే బ్లాక్ స్పెట్స్ యూజ్ చేస్తుంటారు సెక్యూరిటీ గార్డ్స్.

    Also Read: రైతులకు ‘టైం’ ఫిక్స్ చేసిన కేంద్రం..!

    అంతేకాదు.. నేతల పర్యటన అంటేనే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల శత్రువులు మాటువేసే అవకాశం కూడా ఎక్కువే. కాబట్టి గార్డ్స్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక, బహిరంగ సభల వంటి ప్రాంతాల్లో దుమ్ము, ధూళి సహజంగా ఉంటుంది. పొరపాటున దుమ్ము కంట్లో పడి, సెక్యూరిటీ ఇబ్బంది పడుతూ ఉంటే.. అటు దుండగులు తమ పనుల్లో తాము స్పీడ్ అయిపోతే అసలుకే మోసం వస్తుంది. అంతేకాకుండా.. సూర్యుడికి ఎదురుగా నిలబడాాల్సి వస్తే.. కళ్ళు ఇబ్బంది పడకుండా కూడా ఈ స్పెట్స్ రక్షణగా ఉంటాయి.

    మరోవిషయం ఏమంటే.. పొరపాటున ఏదైనా దాడి జరిగినప్పుడు సెక్యూరిటీ కుంగిపోయాడన్నది గమనిస్తే.. శత్రువు రెట్టింపు వేగంతో దాడిచేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హావభావాలను పైకి కనిపించకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలన్నింటినీ కేవలం కళ్లద్దాలతో నివారించే ప్రయత్నం చేస్తుంటారు సెక్యూరిటీ గార్డ్స్. ఈ కారణం వల్లనే ఎండా, వానా.. రాత్రి.. పగలూ అన్న తేడా లేకుండా బ్లాక్ స్పెట్స్ ధరిస్తుంటారు. మొత్తంగా ఇదీ.. సెక్యూరిటీ స్పెట్స్ సీక్రెట్.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్