Omicron: కరోనా కొత్త పుంతలు తొక్కుతోంది. రూపాలు మార్చుతోంది. వేరియంట్లతో ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాల్లో విజృంభిస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మొదటి, రెండో దశల్లో ప్రజలను కష్టాల పాలు చేసిన కరోనా ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి పడగ విప్పుతోంది.

ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ తన ప్రభావం చూపుతోంది. మహారాష్ర్ట, కేరళ, రాజస్తాన్ లాంటి ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రజల్లో కరోనా గురించి భయం పోయిన సందర్భంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోందని తెలుస్తోంది.
తెలంగాణలో కూడా మరో ఆరు వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జనవరి 15 తరువాత మూడో దశ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. అందరు విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకునే క్రమంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని సలహా ఇస్తున్నారు.
Also Read: Putin India Tour: భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొత్త స్నేహానికి దారితీస్తుందా..?
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మరింత నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. వైరస్ సోకకముందే మేలుకోవాలని చెబుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తోంది.
Also Read: Exploitation of investors : నేను, నా దేశం.. ఓ పెట్టుబడిదారుడు..