Omicron: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి ఊహించిన దానికంటే రెండింతలు రెట్టింపుగా ఉంది. మొన్న యూకేలో ఒకే రోజు పది వేల ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. ఒమిక్రాన్ నుంచి తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు ఆయా దేశాధినేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఒమిక్రాన్ గురించి అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. గతంలో వెలుగుచూసిన వేరియంట్ చాలా భిన్నమైదని.. వాటికి ఐదింతల శక్తితో ఇది మనిషి శరీరంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

అసలు మూలాలు ఎక్కడున్నాయ్..
గతంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ముంచెత్తి అల్లకల్లోలం చేసింది. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రజలు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. కరోనా మహమ్మారి మూలం అనేది ఇంకా సైంటిస్టులకు దొరకలేదు. అది దొరికినప్పుడే ఇలాంటి వైరస్‌లను పూర్తిగా నిలువరించవచ్చిని వారు తెలిపారు. అయితే, అగ్రరాజ్యం అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయని, కావాలనే చైనా బయోవార్‌కు తెరతీసిందని పలుమార్లు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. WHO బృందాలను కూడా చైనా కొన్నినెలల పాటు తమ దేశంలోనికి వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో అమెరికా చేసిన వాదనలో నిజం ఉందని మిగతా దేశాలు కూడా నమ్మాయి. అయితే, ఆ తర్వాత WHO బృందాలను చైనా తమ దేశంలోకి అనుమతించడం.. వారు వెళ్లి అక్కడ ఎలాంటి మూలాలు లభించలేదని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్‌ఐవీ మూలాలు
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌లో HIV మూలాలను కనుగొన్నట్టు దక్షిణాఫ్రికా సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అది ఎలా సాధ్యమని ప్రపంచ దేశాలు మరోసారి తలలు పట్టుకుంటున్నాయి. సౌత్ ఆఫ్రికాలో కరోనా వేరియంట్ ఉన్నట్టుండి ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింతో తెలియక దేశాలు అల్లాడుతున్న టైంలో సైంటిస్టులు చెప్పిన కొత్త వార్తతో ఏం చేయాలో ఆయా దేశాధినేతలకు పాలుపోవడం లేదని తెలుస్తోంది.
Also Read: Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్ : దేశంలో ఆంక్షలు మొదలయ్యాయి..
దక్షిణాఫ్రికాలో 18 నుంచి 45ఏళ్ల వయస్సు వారిలో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు HIV బారిన పడ్డారని… అయితే, వీరు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. HIV బాధితులకు కరోనా సోకగా వారి బాడిలో ఉన్న హెచ్ఐవీ వైరస్ కరోనాతో కలిసిపోయే ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది ఉండవచ్చని అక్కడి సైంటిస్టులతో పాటు WHO సైంటిస్టులు కూడా నిర్దారణకు వచ్చారు. ఈ విషయాన్ని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కెంప్ పరిశోధకుల బృందం కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేసింది.
Also Read: Centre bans 20 YouTube channels: పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసిన భారత్.. 20 యూట్యూబ్ చానళ్లు బ్లాక్