నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. 1004 అప్రెంటీస్‌ ఉద్యోగాలు..?

రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1,004 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసై ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీన ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 9 వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. 15 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 12, 2020 6:30 pm
Follow us on


రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1,004 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసై ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీన ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 9 వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. 15 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 12 నెలల పాటు శిక్షణా కాలం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.rrchubli.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు, హుబ్లీ, మైసూరులో సెంట్రల్ వర్క్‌షాప్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్లలో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

https://jobs.rrchubli.in/actapprentice2020-21/ లింక్ ద్వారా డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు. మొత్తం 1,004 ఖాళీలు ఉండగా హుబ్లీ డివిజన్ ఉద్యోగాలు 287, బెంగళూరు డివిజన్ – 280, హుబ్లీ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ – 217 ఉద్యోగాలు, మైసూరు డివిజన్ – 177 ఉద్యోగాలు, మైసూరు సెంట్రల్ వర్క్‌షాప్ లో 43 ఉద్యోగాలు ఉన్నాయి. ఫిట్టర్, ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎలక్టీషియన్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు కాబట్టి వేతనం తక్కువగానే ఉంటుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.