
రైతు లేనిదే మనిషే లేడు. దేశానికి అన్నం పెట్టే వాడే రైతు. రైతు అహర్నిశలు కష్టపడి పండిస్తేనే అందరం ఓ ముద్ద తినగలం. ఎండనక.. వాననక.. చలి అనక.. రాత్రనక.. పగలనక సమయపాలన లేకుండా చేస్తున్న శ్రమతో ధాన్యంరాశులు దక్కుతున్నాయి. అయితే.. ఇంతకష్టపడి పండించినా చివరకు పంట పూర్తిగా చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. ఆరు నెలలు కష్టపడి పండిస్తే అటు ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తుంటాయి. లేదంటే ప్రభుత్వాల చేతిలో మోసపోవాల్సి వస్తుంటుంది. సరైన మద్దతు ధర లేక నిత్యం బతుకు పోరాటమే చేయాల్సి వస్తోంది. ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అసలు ఈ రోజే రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుతారు అని చాలా మందికి తెలియదు. ఒకసారి తెలుసుకుందాం.
Also Read: దేశంలో కొత్త అలజడి.. బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందిలో కరోనా
దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. పట్టెడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం యావత్ భారతవనిలో వినిపిస్తుంటుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుతుంటారు.
చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమిందారి చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్‌సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17న జరుపుతారు.
Also Read: పార్టీ మారిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులిచ్చిన భర్త
మనదేశం రైతులకంటూ ప్రత్యేకంగా దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని ఎంచుకున్నారు. ఆయన పార్లమెంట్‌ని ఎదుర్కోలేక తాత్కాలిక ప్రధానిగానే 1980లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29న మరణించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చరణ్ సింగ్ .. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా డిసెంబర్ 23న కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా భారత దేశంలో జరుపుకొంటారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్