కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. వైరస్ కారణంగా లాక్‌డౌన్‌లు అమలు చేయాల్సి వచ్చింది. దేశాలు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాలు, జిల్లాలను వదిలి సొంత స్థలాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఈ వైరస్ బారి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ఇంతలోనే మరోసారి వైరస్ కలకలం రేపింది.
Also Read: వచ్చే వారమే భారత్ లో కరోనా వ్యాక్సిన్?
కరోనా వైరస్ ముందుగా చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి రాగా.. ఇప్పుడు సెకండ్ వేవ్ బ్రిటన్ నుంచి దూసుకొచ్చింది. అయితే.. అది కొత్త స్ట్రెయిన్ అని బ్రిటన్ దేశం చెప్పుకొస్తుండగా.. ఇప్పటికే బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. దీని ఫలితంగా బ్రిటన్ నుంచి వచ్చి వెళ్లే ఫ్లైట్లకు కూడా బ్రేక్‌లు వేశాయి ఆయా దేశాలు. ఇక ఇప్పటికే బ్రిటన్ నుంచి ఆయా దేశాలకు చేరుకున్న వారిపై నిఘా పెట్టారు.
ఇందులో భాగంగా బ్రిటన్ నుంచి ఇండియాకు వేలాది మంది చేరుకున్నారు. వీరికి టెస్టులు చేయగా.. 20 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. కానీ ఇండియాలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనిపించలేదని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూకే నుంచి సోమ, మంగళవారం రాత్రి ఇండియాలోని విమానాశ్రయాల్లో దిగిన వారిలో 20 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు కోల్ కతా, మరికొందరు అహమ్మదాబాద్, అమృత్ సర్ ఎయిర్ పోర్టుల్లో దిగారు. వీరంతా లండన్ నుంచి ఎయిరిండియా విమానాల్లో దిగినవారే !
Also Read: పార్టీ మారిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులిచ్చిన భర్త
అయితే నీతి ఆయోగ్ డైరెక్టర్ వీకే.పాల్ మాత్రం మన దేశంలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనిపించలేదంటూ స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్‌లో కొత్త వైరస్ ప్రభావం ఉండబోదన్నారు. యూకేలో తలెత్తిన ఈ వైరస్ కారణంగా మరణాలు లేవని, ఆందోళన అనవసరమని పాల్ పేర్కొన్నారు. అటు యూకేతో పాటు సౌతాఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా అన్ని టెస్టులూ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వీరు ఇక్కడికి చేరగానే 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఢిల్లీ, ఒడిశా వాటి రాష్ట్రాలు కూడా ఇలా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్