కేంద్ర ప్రభుత్వంరైతాంగానికి ఎంతో ప్రాధాన్యత నిస్తూ పలు రకాల పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం ఇది వరకు మనకు తెలిసినదే. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతుంది. ఇందులో భాగంగానే పలురకాల పథకాలను ఇప్పటికే రైతులకు అందిస్తోంది. ఇందుకు ఉదాహరణగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతుకు ఆరువేల రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయి.
Also Read..రైతులకు శుభవార్త.. భారీగా తగ్గిన ఎరువుల ధరలు..?
మోడీ ప్రభుత్వం ఒక్క పథకం తోనే కాకుండా రైతులకు మరిన్ని పథకాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మరొక కొత్త ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అదే సోలార్ స్కీం దీనినే కుసుమ్ స్కీం అని కూడా అంటారు. ఈ పథకం ద్వారా రైతులు తమ పొలాలలో సోలార్ ప్యానల్ లను వేసుకుని ప్రతి సంవత్సరం మరింత ఆదాయాన్ని పొందవచ్చు. సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేసినందుకు గాను సోలార్ కంపెనీ రైతులకు అద్దెచెల్లిస్తుంది. లేదంటే రైతులే నేరుగా సోలార్ కరెంటును కంపెనీలకు విక్రయించి మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
ఈ పథకం ద్వారా రైతులు ఎవరైతే వారి పొలాల్లో సోలార్ ప్యానల్ ను వేసుకోవడానికి మద్దతు తెలుపుతారో వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. రైతుల పొలాన్ని సోలార్ ప్యానెల్ లకు అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తారు. అయితే దీని కోసం ఆ కంపెనీలు అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 25 సంవత్సరాల పాటు పొలాన్ని కంపెనీలకు అద్దెకు ఇవ్వాలి. అయితే ఇక్కడ రైతులు ఏమాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
Also Read..రైతు వేదికలు అందుకే ఏర్పాటు చేశాం: కేసీఆర్
ఈ సోలార్ ప్యానల్ లను భూమి నుంచి దాదాపు 3.5 మీటర్ల ఎత్తులో అమర్చి ఉంటారు. అయితే రైతులు ఈ సోలార్ ప్యానల్ కింద పంటలను కూడా పండించుకోవచ్చు. అంతేకాకుండా ఎకరం పొలానికి ప్రతినెల 1000 యూనిట్ల కరెంటు ను కూడా ఉచితంగా అందిస్తుంది. ఇందుకుగాను రైతులకు పిఎం కుసుమ్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులు మరింత ఆదాయాన్ని పొందవచ్చు.