https://oktelugu.com/

అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై అంబర్ పేట నుంచి రామంతాపూర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంబర్ పేట్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు వెనుక టైరు ఆ వ్యక్తి పై నుంచి వెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నగరంలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 12, 2020 / 11:51 AM IST
    Follow us on

    హైదరాబాద్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై అంబర్ పేట నుంచి రామంతాపూర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంబర్ పేట్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు వెనుక టైరు ఆ వ్యక్తి పై నుంచి వెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా సంఘటనా స్థలానికి చేరేకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప అసుపత్రికి తరలించారు. మరోవైపు ఆర్టీస బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.