https://oktelugu.com/

గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ వ్యూహారచనలను సిద్ధం చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని అనుకుంటోంది. మత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ రాజకీయాలు నిలువనుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు పకడ్బంధీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 07:37 PM IST
    Follow us on


    గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ వ్యూహారచనలను సిద్ధం చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని అనుకుంటోంది. మత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ రాజకీయాలు నిలువనుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు పకడ్బంధీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్

    వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం పూర్తికానుంది. దీంతో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చేందుకు అధిక నిధులను వెచ్చిస్తోంది. గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ స్థానికంగా హడావుడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో టీఆర్ఎస్ బలబలాలపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే టీఆర్ఎస్ ప్రచారం మొదలెట్టింది.

    తాజాగా కాంగ్రెస్, బీజేపీ సైతం గడిచిన వారం రోజులుగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవకాశం దక్కింది. ఇక త్వరలోనే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపడుతుందన్న సంకేతాలను పంపాలని ఆపార్టీ భావిస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది.

    Also Read: కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?

    జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ తో పొల్చుకుంటే బీజేపీకి బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నందున బల్దియా ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు వారిద్దరికీ కీలకంగా మారాయి.

    దీంతో అవసరమైతే జాతీయస్థాయి నాయ‌కులతో ప్ర‌చారం చేయాల‌ని వారిద్దరు భావిస్తున్నారు. హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్ర‌చారానికి తీసుకొస్తే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్థానిక బీజేపీలు భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎట్టకేలకు బల్దియాపై ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు మరింత వెడెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.