Meat sales online: ప్రస్తుతం ఆన్ లైన్ మయం అయిపోతోంది. ప్రతిదీ ఆన్ లైన్ లోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏది కావాలన్నా బజారుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి తెప్పించుకోవడం అలవాటుగా మారుతోంది. ట్రెండ్ మారి ప్రజలకు మరింత చేరువవుతోంది. తాజాగా మాంసం, చికెన్ కూడా ఆన్ లైన్ లో చిటికెలో వస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. ఆన్ లైన్ రంగంలో వస్తున్న మార్పులతో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

మార్కెట్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ విధానంలోనే విక్రయాలు, డెలివరీలు జరుగుతున్నాయి. ఒక్క క్లిక్ తోనే చికెన్, మటన్ తలుపు తడుతున్నాయి. జాప్ ఫ్రెస్, లిషియస్, ఈజీమీట్ తదితర సంస్థలు మార్కెట్ లో తమదైన ముద్ర వేస్తున్నాయి. వినియోగదారుల సేవలో తరిస్తున్నాయి. వ్యాపారంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాయి.
ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలోని గురుగ్రాంలో మొదలైన ఈ వ్యాపారాన్ని దీపాన్షు మన్ చందా, శ్రుతి గోశ్వాల్ కలిసి రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. కాలక్రమేణా 12 సరఫరా కేంద్రాలతో మొదలై ప్రస్తుతం వంద కేంద్రాలకు పెరిగింది. రోజు వినియోగదారులకు పసందైన మాంసం అందించేందుకు తన శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. నాణ్యతలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
గడిచిన నాలుగేళ్లలో వ్యాపారం 20 శాతం వృద్ధి చెందింది. మాంసాహారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మాంసాన్ని శీతలీకరణ చేయడంలో కూడా సంస్థ మంచి పద్ధతులు పాటిస్తోంది. వినియోగదారులకు తాజా మాంసం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ రంగంలో వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకుని డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేస్తోంది. వినియోగదారుల సేవలో మాంసం విక్రయ సంస్థ తరిస్తోంది.