Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు అనే వార్తను ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకో లేకపోతున్నారు. ఆయన అక్టోబర్ 29 న హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. పునీత్ లేని లోటు కేవలం కర్ణాటక లోని నటులకే కాక సినీ ఇండస్ట్రి లోని అందరికీ తీరని లోటు అని చెప్పాలి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ… తనదైన శైలిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు పునీత్. చేసింది 29 సినిమాలే అయినా ప్రేక్షకుల నుంచి అంతులేని అభిమానం సంపాదించుకున్నారు పునీత్.

ఈ పునీత్ క్లు నివాళి అర్పించడానికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచిన్ ప్రముఖ నటులు ఆయన పర్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అలానే కొందరు నటులు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం తెలిసిన విషయమే. తాజాగా సీనియర్ నటి జయప్రద పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మన మధ్య లేడు అంటే నమ్మలేకపోతున్నా అంటూ జయప్రద కన్నీటి పర్యంతం అయ్యారు. పునీత్ ఇక లేడు అని అనుకుంటుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది అని అన్నారు. రాజ్ కుమార్ గారి కుటుంబం అంటే తనకు చాలా ఇష్టం అని… ఆ కుటుంబంలో తాను ఒక సభ్యురాలినని చెప్పారు. ఎంతో గొప్ప నటుడిగా , గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న అప్పు చిన్నవయసులోనే మన నుంచి దూరం అయ్యడంటే నమ్మలేకపోతున్న అని వాపోయారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.