https://oktelugu.com/

Maoists: మావోయిస్టు ఉద్యమానికేమైంది? ఎందుకీ లొంగుబాట్లు?

Maoists: మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేడర్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉండడంతో రిక్రూట్ మెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మావోయిస్టు ఉద్యమం ఒకప్పుడు బలంగా ఉన్నా క్రమంగా క్షీణిస్తోంది. అగ్రనేతల్లో ఎక్కువ మంది లొంగిపోవడంతో ఉద్యమం నీరుగారిపోతోందనే ఆందోళన నెలకొంది. గడచిన రెండున్నరేళ్లలో సుమారు 171 మంది మావోయిస్టు లొంగిపోవడంతో ఇక ఉద్యమం ముందుకు పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. నిర్బంధ లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు, స్వచ్చంధ లొంగుబాట్లు, అనారోగ్యాలు తదితర కారణాలతో ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2021 / 06:09 PM IST
    Follow us on

    Maoists: మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేడర్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉండడంతో రిక్రూట్ మెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మావోయిస్టు ఉద్యమం ఒకప్పుడు బలంగా ఉన్నా క్రమంగా క్షీణిస్తోంది. అగ్రనేతల్లో ఎక్కువ మంది లొంగిపోవడంతో ఉద్యమం నీరుగారిపోతోందనే ఆందోళన నెలకొంది. గడచిన రెండున్నరేళ్లలో సుమారు 171 మంది మావోయిస్టు లొంగిపోవడంతో ఇక ఉద్యమం ముందుకు పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

    నిర్బంధ లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు, స్వచ్చంధ లొంగుబాట్లు, అనారోగ్యాలు తదితర కారణాలతో ఎక్కువ మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నేతలే ఎక్కువగా ఉండడంతో మావోయిస్టు ఉద్యమం నాలుగు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి పోతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం కూడా వారిని భయపెడుతూ లొంగిపోయేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యమం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.

    కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నేతలందరు లొంగిపోయేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట కార్యదర్శి హరిభూషణ్ కరోనాతోనే మరణించారు. చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి హరిభూషణ్ భార్య శారద కూడా లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ములుగు జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు కూడా లొంగుబాటుకు తయారుగా ఉన్నట్లు తెలుస్తోంది.

    దండకారణ్య సమితి దళ సభ్యుల్లో చాలా మంది లొంగిపోయారు. అనారోగ్యాల కారణంగా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో లొంగుబాట్లు పెరుగుతున్నాయి. గత సంవత్సరం 50 మంది మావోయిస్టులు లొంగిపోతే ఈ ఏడాది ఇప్పటికే 42 మంది లొంగిపోయారు. దీంతో మొత్తం 52 మంది కొరియర్లు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టు పార్టీలో ఆందోళన నెలకొంది.