Telangana, AP: తెలంగాణ, ఏపీ మధ్య బకాయిల బాహాబాహీ

Telangana, AP: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జల వివాదాలతో మొదలై పంచాయితీ ఆస్తుల వరకు కూడా వెళుతోంది. ఆస్తుల విషయంలో ఏపీకి దక్కాల్సిన వాటాలపై వివాదం రేగుతోంది. ఆస్తుల పంపకాల విషయంలో తమ వాటాలు తమకు కావాలని భావిస్తూ రెండు ప్రభుత్వాలు మొండికేస్తున్నాయి. దీంతో పంచాయితీ కాస్త జోరందుకుంటోంది. విభజన నాటి హామీలు నెరవేరకపోవడంతో రెండు ప్రాంతాల మధ్య చర్చ సాగుతోంది. తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి రూ. రూ.3441 కోట్లు బకాయిలు […]

Written By: Srinivas, Updated On : September 14, 2021 6:27 pm
Follow us on

Telangana, AP: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జల వివాదాలతో మొదలై పంచాయితీ ఆస్తుల వరకు కూడా వెళుతోంది. ఆస్తుల విషయంలో ఏపీకి దక్కాల్సిన వాటాలపై వివాదం రేగుతోంది. ఆస్తుల పంపకాల విషయంలో తమ వాటాలు తమకు కావాలని భావిస్తూ రెండు ప్రభుత్వాలు మొండికేస్తున్నాయి. దీంతో పంచాయితీ కాస్త జోరందుకుంటోంది. విభజన నాటి హామీలు నెరవేరకపోవడంతో రెండు ప్రాంతాల మధ్య చర్చ సాగుతోంది.

తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి రూ. రూ.3441 కోట్లు బకాయిలు ఉన్నట్లు చెబుతోంది. 2017 నాటికి రూ.2841 కోట్ల వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దీంతో తెలంగాణ ఏపీకి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని తన పిటిషన్ లో తెలిపింది. ఈ నేపథ్యంలో బకాయిల గోల రెండు తెలుగు ప్రాంతాల్లో ఆందోళన రేపుతున్నాయి. డబ్బుల గురించి అడిగి అడిగి విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెబుతోంది. దీంతో తమకు రావాల్సిన రూ.6283 కోట్లు చెల్లించాలని ఏపీ జెన్ కో ఎండీ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు.

విద్యుత్ సంస్థలపై భారం పెరిగిపోతోవడంతో పలుమార్లు లేఖలు సైతం రాసినప్పటికి ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. తెలంగాణ బకాయిలు చెల్లించకపోతే తమకు ఇబ్బందులు తప్పవని ఏపీ వాపోతోంది. వేల కోట్లు అప్పులు బకాయిలుగా ఉండడంతో ఏపీకి మనుగడ కష్టమైపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సైతం లెక్కలు చూసుకుందామని చెప్పినా వాటిని తీర్చడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే హైకోర్టు ద్వారా బకాయిలు చెల్లించాలని కోరుతోంది. వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలివ్వాలని ఏపీ విన్నవిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.3441 కోట్ల బకాయిలు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరుతోంది.

ఏపీ జెన్ కో పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ
అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. తెలుగు స్టేట్లలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇవి ఏమేరకు పరిష్కారం అవుతుందో వేచి చూడాల్సిందే.