Mallareddy Group Of Institutions Google: మీడియాలో, సోషల్ మీడియాలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసే సందడి మామూలుగా ఉండదు. ఆయన ఏ మాట మాట్లాడినా సరే మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇస్తుంది. సోషల్ మీడియా అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న మల్లారెడ్డి.. మీడియా, సోషల్ మీడియాపై విపరీతమైన పట్టు ఉంటుంది. అందువల్లే ఆయన మీడియా తన చుట్టూ తిరిగే విధంగా మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు మల్లారెడ్డి తరహాలోనే ఆయన కుమారుడు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో అందుకు బలం చేకూర్చుతోంది.
మల్లారెడ్డికి ఇద్దరు కుమారులు. అందులో భద్రారెడ్డి ఒకరు. భద్రారెడ్డి మల్లారెడ్డి విద్యాపీట్ ను పర్యవేక్షిస్తున్నారు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. రాజకీయాలలోకి కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో భద్రారెడ్డి యాక్టివ్ గా ఉంటారు. కాలేజీల వ్యవహారాలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. సిబ్బందితో మాట్లాడుతూ ఉంటారు. వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు భద్రారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యారు. ఎందుకంటే ఆయన పర్యవేక్షిస్తున్న విద్యాసంస్థలు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భద్రారెడ్డి ప్రకటించారు.
గూగుల్ సంస్థ అతిపెద్ద క్యాంపస్ ను ఇండియాలో హైదరాబాదులోనే ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థతో తమ కళాశాల ఒప్పందం కుదుర్చుకుందని తెలంగాణ గవర్నర్, మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మల్లారెడ్డి, గూగుల్ ఇండియా బాధ్యుడి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని భద్రారెడ్డి ప్రకటించారు. భద్రారెడ్డి చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. ప్రఖ్యాత గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని భద్రారెడ్డి ప్రకటించారు.
కొంతకాలంగా మల్లారెడ్డి సంస్థల పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలము ఆక్రమించారని.. అలా ఆక్రమించి అతిపెద్ద నిర్మాణాలు చేపట్టారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఆక్రమించిన వాటిని పడగొడుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మల్లారెడ్డి విద్యాసంస్థలకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు మల్లారెడ్డి విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అయితే ఈ ఒప్పందం ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి.. వారికి ఏ విభాగాలలో ఉపాధి కల్పిస్తారు.. అనే విషయాలను భద్ర రెడ్డి వెల్లడించలేదు. కాకపోతే మల్లారెడ్డి విద్యాసంస్థలలో ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన విభిన్నమైన కోర్సులను బోధిస్తున్నారు. పైగా మల్లారెడ్డి కళాశాలలో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ నైపుణ్యాలు నేర్పించే బాధ్యతను గూగుల్ తీసుకుంటుందని తెలుస్తోంది.
View this post on Instagram