
భారతదేశం విభిన్న ప్రదేశాలకు ప్రసిద్ధి. పర్వతాలు, అడవులు, సరస్సులు, లోయలు, కోటలు తదితర వాటికి కొదవలేదు. దీంతో ప్రపంచంలో వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. దీంతో పర్యాటక ప్రాంతంగా ఇండియాకు మంచి పేరుంది. భారత్, మయన్మార్ సరిహద్దులో ఒక సరస్సు ఉంది. దీన్ని లేక్ ఆఫ్ నో రిటర్న్ అని పిలుస్తారు. కొన్ని సంఘటనల కారణంగా ఈ సరస్సు అంతర్జాతీయంగా అపఖ్యాతి చెందింది. దీని దగ్గరకు ఎవరు వెళ్లినా తిరిగి రారు అని తెలుస్తోంది.
ఈ సరస్సు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఇది ఓ మైదానంలా ఊహించుకుని అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కానీ ఆ విమానం పైలట్ తో సహా అదృశ్యమైందని చెబుతారు. వీరి కోసం వెతికిన అమెరికన్ సైనికులు కూడా తిరిగి రాలేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈ సరస్సు బహుళ ప్రజాదరణ పొందినట్లు చెబుతున్నారు. అక్కడకు వెళ్లిన ఎవరు కూడా తిరిగి వెనక్కి రాలేదని కథ ప్రచారంలో ఉంది. దీంతో దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపనీస్సైనికులు కూడా ఈ సరస్సులో దిగినట్లు చెబుతున్నారు. అందులో దిగిన సైనికులు మాత్రం తిరిగి రాలేదట. ఇక అప్పటి నుంచి అందులో దిగేందుకు ఎవరు కూడా సాహసం చేయడం లేదు. ఇలాంటి ప్రచారాలు చోటుచేసుకోవడంతో దీనిపై సినిమాలు కథలు చాలా వచ్చాయి. అందుకే చాలా మంది టూరిస్టులు ఈ సరస్సును చూసేందుకు వెనకడుగు వేస్తుంటారు.
దీంతో ఈ సరస్సు గురించి పలు కోణాల్లో కథలు చెబుతుంటారు. ఇక్కడికి వెళ్లిన వారు ఇప్పటివరకు తిరిగి రాలేదని చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపై ఇదే రకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సరస్సు వద్దకు వెళ్లే ధైర్యం కూడా ఎవరు చేయడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి అందులోని రహస్యాలు ఛేదించి అందులోని వాస్తవాలను బయటపెడితే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలుస్తోంది.