Karnataka Election Result 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 మే 10వ తేదీన ముగిశాయి. దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వస్తాయని తేల్చాయి. లేదంటే హంగ్ ఏర్పడొచ్చని స్పష్టం చేశాయి. ఈ ఫలితాలు మే 13 అయిన ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి ఎవరు విజేతలు అన్నది ఓ క్లారిటీ రావచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మినట్ టు మినట్ లైవ్ అప్డేట్స్ మీ కోసం…
2018 ఎన్నికలతో పోలిస్తే కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు బాగా పెరిగింది. ఈ ఎన్నికల్లో 5 శాతం అధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలు సాధించడం విశేషం. అదే విధంగా జేడీఎస్ 5 శాతం ఓట్లు కోల్పోయింది. మధ్యకర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, మైసూర్, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఓడిపోయినా.. బెంగళూరు, కోస్తా కర్ణాటకలో బీజేపీ పట్టు నిలుపుకుంది. జేడీఎస్ కు మాత్రం ఊహించని పరాభవం ఎదురైంది. మైసూర్ మినహా ఎక్కడా ప్రభావం చూపించలేకపోయింది.
కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన అపూర్వ విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముందుగా కర్ణాటకలో తమ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పారు. కర్ణాటకలో పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం జరిగిందన్న రాహుల్ .. కాంగ్రెస్ పేదల తరుఫున పోరాడిందన్నారు. ఇది అందరి విజయం.. కర్ణాటక ప్రజల విజయం అన్నారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన వాగ్ధానాలను తొలి కేబినెట్ లోనే నెరవేరుస్తామన్నారు. భవిష్యత్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 131 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జేడీఎస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కర్ణాటక చరిత్రలో హంగ్ లేకుండా కేవలం మూడు సార్లు మాత్రమే ప్రజలు క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చారు. 1972-75లో కాంగ్రెస్ కు.., 1999 ఎస్ఎం కృష్ణ, 2013-18లో సిద్ధారమయ్య హయాంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు ఓటు వేశారు. ఈ మూడు సార్లు కాంగ్రెస్ నే విజేతగా గెలవడం విశేషం.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును పురస్కరించుకొని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రెడ్ హిల్స్ హనుమాన్ దేవాలయంలో గతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గద బహూకరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్ లు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మరోవైపు కాంగ్రెస్ 117, బీజేపీ 68, జేడీఎస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు (113) మార్కును దాటేసింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. 120కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బీజేపీ 73, జేడీఎస్ 29 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
హైదరాబాదులో కర్ణాటక రాజకీయం మొదలైంది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో హంగ్ సర్కార్ ఏర్పాటుకు ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించాయి. 30 ఏళ్ల అధికార మార్పు సంప్రదాయాన్ని మారుస్తామని బీజేపీ బీరాలు పలికినా.. ఫలితాలు అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. కర్ణాటకలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగించారు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. అయితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 113 వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. ఇందుకు రెండు పార్టీలు హైదరాబాద్ ను వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొందరు కన్నడ నేతలు రెండు పార్టీల తరఫున స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నారు.
కర్ణాటకలో గెలుపు అవకాశాలు పెరగడంతో ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కాల్స్ వెళుతున్నాయి. వెంటనే అందరినీ బెంగళూరుకు రావాలని ఆదేశించింది.దీంతో గెలిచే అభ్యర్థులందరూ బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి క్యాప్ నకు తరలించేందుకు రెడీ చేశారు.
కర్ణాటకలో గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నేతల్లో చాలా మందిలో జోష్ నెలకొంది. గత పదేళ్లుగా బీజేపీ విజయాలు సాధిస్తుండడంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్ నేతలకు జోష్ వచ్చింది. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు ప్రారంభయ్యాయి. కాంగ్రెస్ నేతలు డ్యాన్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.
#WATCH | Celebrations underway at national headquarters of Congress party in New Delhi as counting of votes gets underway for #KarnatakaPolls. pic.twitter.com/e0eGObhLh3
— ANI (@ANI) May 13, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Karnataka election result 2023 live updates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com