Chandrayaan 3 : ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లి యాత్రలో మరో అడుగు ఘనంగా పడింది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య లోకి చంద్రయాన్_3 అడుగు పెట్టింది. చంద్రుడి కక్ష్య లోకి చంద్రయాన్ _3 ను ప్రవేశపెట్టే దశను శనివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. దానికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇక ఇప్పటినుంచి చంద్రయాన్_3 చంద్రుడి కక్ష్యలో 18 రోజులపాటు ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23 లేదా 24 అది కూడా కుదరకపోతే 25వ తేదీన చంద్రుడి ఉపరితలం మీద స్పేస్ క్రాఫ్ట్ లో విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. చంద్రుడి దక్షిణ దృవం పై పరిశోధనల కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రయన్_3 ని పంపింది. చంద్రయాన్_3 చంద్రుడిపై దిగేక్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని తెలిపింది. చంద్రయాన్_2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్_3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా అని స్పష్టం చేసింది. గతంలోనే చంద్రయాన్_2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొట్టింది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మొత్తం పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు లాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదికి పంపారు.
18 రోజులు చంద్రుడి కక్ష్యలో చంద్రయాన్_3 ఉంటుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో పరిస్థితులను అంచనా వేస్తుంది. గతంలో చంద్రుడి మీద నీటి జాడలను ఇస్రో మాత్రమే గుర్తించింది. ఇస్రో కంటే ముందు నాసా, చైనా పలు రకాల ప్రయోగాలు చేసినప్పటికీ ఈ విషయాన్ని గుర్తించలేకపోయాయి. అయితే ఆ దేశాలతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్_3 ని భారత్ ప్రయోగించింది. చంద్రయాన్_2 వల్ల జరిగిన నష్టాలను, ప్రతికూలతలను ఈ ప్రయోగం ద్వారా అధిగమించగలిగింది. 18 రోజుల అనంతరం చంద్రుడి స్పేస్ క్రాఫ్ట్ మీద విక్రమ్ ల్యాండర్ దిగితే దాదాపు ఇస్రో చేసిన ప్రయోగం విజయవంతమైనట్టే.
Chandrayaan-3 Mission:
“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
🙂Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.
A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.
The next… pic.twitter.com/6T5acwiEGb
— ISRO (@isro) August 5, 2023