చంద్రబాబుకు భారీ షాక్…. ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టించబోతున్న మంత్రి..?

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న 2014 – 2019 మధ్య కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అప్పటి ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. కొందరు టీడీపీ నేతలు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌(సిట్) తో అమరావతి భూముల గురించి విచారణకు ఆదేశించింది. సిట్ కొన్ని […]

Written By: Navya, Updated On : September 13, 2020 2:16 pm
Follow us on

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న 2014 – 2019 మధ్య కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అప్పటి ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. కొందరు టీడీపీ నేతలు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌(సిట్) తో అమరావతి భూముల గురించి విచారణకు ఆదేశించింది.

సిట్ కొన్ని నెలల నుంచి అమరావతి భూముల గురించి దర్యాప్తు జరుపుతోంది. అయితే దర్యాప్తుకు సంబంధించిన విషయాలను సిట్ గోప్యంగా ఉంచుతోంది. అయితే తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ నమోదు చేయబోయే ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు పేరు తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ మీడియా ముందు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

బొత్స అధికార పార్టీకి చెందిన నేత కాబట్టి ఆయన వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేయలేం. తెలుగుదేశం పార్టీ నేతలు దళితులను మోసం చేసి అసైన్డ్ ల్యాండ్స్ ను కొనుగోలు చేశారని… చంద్రబాబు వారి వెనుక ఉన్నాడని బొత్స అన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అంతర్వేది రథం ఘటనను పక్కదారి పట్టించేందుకు బొత్స ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాడని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య తలెత్తితే ఆ సమస్యను పక్కదారి పట్టించడానికి వైసీపీ నేతలు ఈ తరహా ప్లాన్స్ వేస్తారని టీడీపీ నేతలు వాపోతున్నారు. టీడీపీ నేత యనమల బొత్స వ్యాఖ్యల గురించి స్పందిస్తూ సిట్ దర్యాప్తులోని విషయలను లీక్ చేయడం కూడా నేరమేనని అన్నారు. మరొ బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయో లేదో తెలియాల్సి ఉంది.