రైలు ప్రయాణికులకు శుభవార్త.. సులభంగా టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్..?

రైలు ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసింది. ఫలితంగా రేపటినుంచి రైలు ప్రయాణికులు సులభంగా టికెట్ ను బుక్ చేసుకునే అవకాశంతో పాటు రైళ్ల అన్ని తరగతులు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకే పేజీలో అందుబాటులోకి రానున్నాయి. టికెట్లతో పాటు మీల్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తూ ఉండటం గమనార్హం. Also Read: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్… […]

Written By: Navya, Updated On : January 1, 2021 11:02 am
Follow us on


రైలు ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసింది. ఫలితంగా రేపటినుంచి రైలు ప్రయాణికులు సులభంగా టికెట్ ను బుక్ చేసుకునే అవకాశంతో పాటు రైళ్ల అన్ని తరగతులు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకే పేజీలో అందుబాటులోకి రానున్నాయి. టికెట్లతో పాటు మీల్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్… పరీక్షలు ఎప్పుడంటే..?

ఇకపై ఆన్ లైన్ ద్వారా రైలు టికెట్లను బుకింగ్ చేసుకునే వాళ్లు సులభంగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ యాప్ కూడా అప్ గ్రేడ్ కావడంతో రేపటినుంచి రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ నుంచి మెరుగైన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలో 83 శాతం మంది ప్రయాణికులు ఆన్ లైన్ ద్వారానే రిజర్వ్‌డ్ టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారు. దేశంలో ప్రతిరోజూ సగటున 8 లక్షల టికెట్లు రిజర్వ్ అవుతున్నాయి.

Also Read: కోతి వల్ల ప్రాణాలు కోల్పోయిన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఏం జరిగిందంటే..?

ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ సమయంలో కూడా వివరాల నమోదులో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. వేరే తేదీలలో సీట్ల లభ్యత వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. ఇకపై వెయిటింగ్ లిస్ట్ లో పేరు ఉంటే కన్ఫర్మ్ అవుతుందో లేదో సులభంగా తెలుస్తుంది. సీట్ల అందుబాటు సమాచారం గతంతో పోలిస్తే ఇకపై వేగంగా లోడ్ అవుతుంది. ఒకేచోట రైళ్లు, సీట్లు, ధరలు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ వెబ్ సైట్ లో మార్పులు చేసింది.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

ఇకనుంచి ఒకే పేజీలో ట్రయిన్ సెర్చ్, బుకింగ్ కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. రెగ్యులర్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం మరియు సులభంగా రిఫండ్ స్టేటస్ ను తెలుసుకోవడం చేయవచ్చు.