Homeఅంతర్జాతీయంInflation: ద్రవ్యోల్బణం: అగ్రరాజ్యాల కుదేలు.. నిలబడిన భారత్.. కారణం ఏంటి?

Inflation: ద్రవ్యోల్బణం: అగ్రరాజ్యాల కుదేలు.. నిలబడిన భారత్.. కారణం ఏంటి?

Inflation: రూపాయి విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవితకాల కనిష్టాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికన్ ఫెడరల్ బ్యాంకు ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లు అమాంతం పెంచుకుంటూ పోతుంది. ఫలితంగా మార్కెట్లన్ని ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నాయి. పైగా మాంద్యం వస్తుందన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు వణికి పోతున్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల రూపాయి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి మోడీ పనితీరు బాగా లేకపోవడం వల్లే రూపాయి విలువ పడిపోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కెసిఆర్ లాంటి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి కూడా 2012 లో యూపీఏ హయాంలో రూపాయి విలువ పడిపోతున్నప్పుడు మోడీ చేసిన ప్రసంగాలను ఉటంకిస్తున్నారు. క్రమంలో పడిపోతున్న రూపాయి విలువను కట్టడి చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికే వడ్డీరేట్లు పెంచినా ఆశించినంత మేర ప్రయోజనాలు దక్కడం లేదు.

Inflation
Inflation

-ద్వైపాక్షిక వ్యాపారం నిర్వహించేందుకు?
పడిపోతున్న రూపాయి విలువను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెరతీసింది. ఇందులో భాగంగానే రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కొనుగోలు చేసేందుకు చెల్లింపులను రూపాయలోనే జరిపింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఆ దిశగానే లావాదేవీలు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రూపాయి మార్గంలో ద్వైపాక్షిక వ్యాపారం నిర్వహించేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా ఒక విధానాన్ని ప్రకటించిన అనంతరం ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. క్యాపిటల్ అకౌంట్ పూర్తి కన్వర్టబిలిటీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ద్వైపాక్షిక వాణిజ్యం వైపు అడుగులు బలంగా పడుతున్నాయి. రూపాయి మార్గంలో వాణిజ్యమంటే గతంలో రూబుల్_ రూపాయిగా ఉండేది. కానీ బైపాక్షిగా వాణిజ్యాన్ని రూపాయి మార్గంలో అనుమతించేలా ఆర్బిఐ ప్రకటించడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ అవసరాలు, ఆర్థిక వ్యవస్థ మూలాలకు అనుగుణంగా రూపాయి దానంతట అదే సర్దుబాటు అయ్యేలా ఆర్బిఐ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రూపాయి రక్షణకు రంగంలోకి దిగాల్సినంత ఆందోళన పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ మూలాలు లేవని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఆగస్టులో అమెరికన్ డాలర్ మార్గంలో రూపాయి చారిత్రక కనిష్టస్థాయి 80.15 కి చేరింది. ప్రస్తుతం 79.20 స్థాయిలో కదలాడుతోంది.

-ఇండియా ఇంక్ ది హనుమంతుడి బలం
ఇండియా ఇంక్ ( పారిశ్రామిక రంగం) కి మన పురాణాల్లో హనుమంతుని శక్తితో సమానమైన శక్తి ఉన్నప్పటికీ పారిశ్రామికవేత్తలు తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టకుండా నిలువరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే స్వదేశీయులతో పోలిస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్ పట్ల ఆచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. మొన్నటిదాకా అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడంతో పెట్టుబడులను ఉపసంహరించుకున్న వారు.. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణి నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అయితే వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు సెబీ మాజీ చైర్మన్ దామోదరన్ నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

Inflation
Inflation

దీంతో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కుదేలవుతున్నా బలమైన భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి, రికవరీ, వ్యవస్థల సాయంతో అధిగమిస్తోంది. ప్రపంచంలోని దేశాలతో పోలిస్తే మన ద్రవ్యోల్బణం రేటు కూడా మెరుగ్గా ఉండడం విశేషం. అగ్రరాజ్యాలైన అమెరికా, యూరప్, జర్మరనీ, కెనాలు ద్రవ్యోల్బణంలో మనకంటే వెనుకబడి ఉన్నాయి. కానీ భారత ద్రవ్యోల్బణం అధిగమించి ముందుకు సాగుతోంది.అమెరికా 8.3 ద్రవ్యోల్బణం ఉండగా.. భారత్ కేవలం 7.0 మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే టర్కీ అత్యధికంగా 80.21 శాతం ద్రవ్యోల్బణంతో కుదేలవుతోంది. ఆ తర్వాత అర్జీంటీనా (71 శాతం, రష్యా 15.1 శాతంతో ఇబ్బంది పడుతోంది. భారత్ మాత్రం కేవలం 7.0 తో మాత్రమే ఉండి నిలదొక్కుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రేటు చూస్తే..

ద్రవ్యోల్బణం రేటు (%):

🔴టర్కీ 80.21
🔴అర్జెంటీనా 71
🔴రష్యా 15.1
🔴నెదర్లాండ్స్ 12
🔴స్పెయిన్ 10.4
🔴UK 10.1
🔴బ్రెజిల్ 10.07
🔴యూరో ఏరియా 9.1
🔴USA 8.3
🔴ఇటలీ 8.4
🔴మెక్సికో 8.15
🔴జర్మనీ 7.9
🔴కెనడా 7.6
🔴భారతదేశం 7.0
🔴ఆస్ట్రేలియా 6.1

దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారతదేశం కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. మనం ఆర్థికంగా స్థిరంగా ఉండి మాంద్యంలోకి జారిపోవడం లేదని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular