Site icon OkTelugu

Dhurandhar Remake In Tollywood: టాలీవుడ్ లో ‘ధురంధర్’ రీమేక్..నటీనటుల వివరాలు ఇవే..సంచలనం రేపుతున్న వీడియో!

Dhurandhar 2 Movie Advance Bookings

Dhurandhar 2 Movie Advance Bookings

Dhurandhar Remake In Tollywood: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించి, రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, నెట్ ఫ్లిక్స్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఒక పక్క నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం దుమ్ము లేపుతూ ముందుకు పోతుంటే, థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్లడం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. చూస్తుంటే ఈ చిత్రం ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ వచ్చే వరకు థియేటర్స్ లో ఆడుతూనే ఉండేలా ఉంది. ఈ చిత్రం వచ్చే నెల 19న విడుదల కాబోతుంది.

ఇదంతా పక్కన పెడితే ఒకవేళ తెలుగు లో ‘ధురంధర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే ఇది నిజంగా రీమేక్ అవ్వడం లేదనుకోండి, కేవలం అభిమానుల ఊహలు మాత్రమే. రీసెంట్ గానే AI ని ఉపయోగించి ‘ధురంధర్’ మూవీ లోని కొన్ని క్యారెక్టర్స్ ని మన టాలీవుడ్ హీరోల ముఖాలతో మార్ఫింగ్ చేసి ఒక వీడియో ని చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దానిని మీరు క్రింద చూడొచ్చు. ఈ చిత్రంలో హీరో హంజా అలీ మజారీ క్యారెక్టర్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అదే విధంగా విలన్ రెహమాన్ డెకాయిట్ పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఊహించుకుంటూ ఈ వీడియో ని చేశారు. ఇది చూసిన నెటిజెన్స్ ఈ వీడియో ని ఎవరు చేశారో తెలియదు కానీ, పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం లోని ఇతర ముఖ్య పాత్రలు అయినటువంటి మేజర్ ఇక్బల్ పాత్రకు రానా దగ్గుబాటి, SP చౌదరి పాత్రకు నందమూరి బాలకృష్ణ కనిపించారు. అన్ని పాత్రలు కూడా ఎదో ఇరికించినట్టు కాకుండా, వీళ్ళ కోసమే డిజైన్ చేసినట్టుగా అనిపించింది ఈ వీడియోని చూస్తుంటే. అంతే కాదు ఈ సినిమాని మన టాలీవుడ్ హీరోలతో చేస్తే ఎంత బాగుండేది అనే ఫీలింగ్ కూడా కలిగేలా చేసింది ఈ వీడియో. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Exit mobile version