https://oktelugu.com/

Janhvi Kapoor: ప్యాంటు లేకుండా దేవర హీరోయిన్ తెగింపు… జాన్వీ బోల్డ్ ట్రీట్ కి సోషల్ మీడియా షేక్

జాన్వీ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య ఎన్టీఆర్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు. వెండితెరను ఏలిన ఇద్దరు లెంజెడ్స్ వారసులు జత కట్టడం దేవర చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత.

Written By: , Updated On : September 30, 2023 / 12:31 PM IST
Follow us on

Janhvi Kapoor: శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. అయితే ఇంకా బ్రేక్ రాలేదు. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. ఆఫర్స్ వస్తున్నా ఆ రేంజ్ కి వెళ్ళలేదు. ఆ కోరిక దేవర మూవీతో దక్కుతుందేమో చూడాలి. కేవలం శ్రీదేవి కూతురు అనే హోదాలో ఆమెకు దేవర వంటి భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. ఒక మ్యాజిక్ కాంబినేషన్ సెట్ చేసేందుకు ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు.

జాన్వీ తల్లి శ్రీదేవి, జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య ఎన్టీఆర్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు. వెండితెరను ఏలిన ఇద్దరు లెంజెడ్స్ వారసులు జత కట్టడం దేవర చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత. దేవరలో జాన్వీ కపూర్ పాత్ర చాలా కీలకం అట. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా తెలియజేశాడు. ఇక లంగా ఓణీలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. శరవేగంగా దేవర షూటింగ్ జరుపుకుంటుంది. దేవర 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ సౌత్ లో పాగా వేసినట్లే. ఆల్రెడీ రామ్ చరణ్ చిత్రానికి సైన్ చేశారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్ 16వ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం కలదట. అలాగే ఓ తమిళ చిత్రానికి జాన్వీ సైన్ చేశారని వార్తలు వస్తున్నాయి.

అటు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అమ్మడు. మోడల్ గా కూడా రాణిస్తున్న జాన్వీ కపూర్ కేజ్రి ఫోటో షూట్స్ కి పెట్టింది. స్కిన్ షోలో అమ్మడు హద్దులు దాటేస్తారు. మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తుంది. తాజాగా ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చి షాక్ ఇచ్చింది. జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక జాన్వీ కపూర్ పై పలు ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. అయితే తనపై వచ్చే రూమర్స్ పై జాన్వీ అసలు స్పందించరు. జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ సైతం వెండితెర ఎంట్రీకి సిద్దమైంది. ఆర్చీస్ టైటిల్ తో ఆమె ఓ చిత్రం చేస్తుంది. ఈ మూవీలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సైతం నటిస్తుంది.