Devotional Tips: ఇంటి దగ్గర తరచూ కాకులు అరుస్తున్నాయా.. అది దేనికి సంకేతమో తెలుసా?

Devotional Tips: సాధారణంగా కాకి అంటే చాలామందికి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. కాకి శనీశ్వరుడి వాహనం కనుక కాకి మన ఇంటి దరిదాపుల్లో అరుస్తున్నా లేదా మన ఇంట్లోకి వచ్చిన అశుభంగా భావించి చాలామంది ఇల్లు వదిలి పెట్టడం లేదా ఇంటిలో శాంతి హోమం చేయించడం చేస్తుంటారు. అదే విధంగా కొన్ని సార్లు మన ఇంటి దగ్గర తరచూ ఆకులు అరుస్తూ ఉంటాయి. ఇలా కాకులు అరవడం ఆ శుభానికి సంకేతం అని చాలా మంది […]

Written By: Navya, Updated On : January 20, 2022 5:42 pm
Follow us on

Devotional Tips: సాధారణంగా కాకి అంటే చాలామందికి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. కాకి శనీశ్వరుడి వాహనం కనుక కాకి మన ఇంటి దరిదాపుల్లో అరుస్తున్నా లేదా మన ఇంట్లోకి వచ్చిన అశుభంగా భావించి చాలామంది ఇల్లు వదిలి పెట్టడం లేదా ఇంటిలో శాంతి హోమం చేయించడం చేస్తుంటారు.

అదే విధంగా కొన్ని సార్లు మన ఇంటి దగ్గర తరచూ ఆకులు అరుస్తూ ఉంటాయి. ఇలా కాకులు అరవడం ఆ శుభానికి సంకేతం అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ విధంగా తరుచూ ఇంటిదగ్గర కాకులు అరవడం దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం…

Devotional Tips:

కాకి మన ఇంటి మేడపై లేదా కాంపౌండ్ గోడ పై వాయువ్య మూలన కూర్చుని అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తున్నారని సంకేతం. అదేవిధంగా కాకి ఆగ్నేయ మూలలో కూర్చొని అరిస్తే మన ఇంట్లో ఒకరికి మృత్యు గండం ఉందని అర్థం. ఇలా ఆగ్నేయ మూలలో కాకి కూర్చుని అరచినప్పుడు మనం దానిని గమనించి వెంటనే పండితులను పిలిపించుకుని శాంతి హోమం చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వల్ల మృత్యు దోషం తొలగిపోతుంది.

Also Read:  వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?

అదేవిధంగా కాకి నైరుతి దిశలో కూర్చొని ఎక్కువగా అరుస్తుంది అంటే మన ఇంటికి ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం. ఈ విధంగా కాకులు అరిచే అరుపులలో కూడా ఎన్నో సంకేతాలు ఉంటాయి.ముఖ్యంగా ఒకే ఇంటిపై కాకులు గుంపులుగా అరుస్తున్నాయి అంటే తప్పనిసరిగా ఇంట్లో పెద్ద ప్రమాదం జరుగుతుందని సంకేతం. ఇలా కాకులు గుంపులు గుంపులుగా ఇంటి మేడపై తిరుగుతూ అరవడం వల్ల ఆ ఇంట్లో ముగ్గురు చనిపోతారని, కాకి పురాణంలో తెలియజేయబడింది. చాలామంది కాకి కూడా పురాణం ఉంటుందా అనే సందేహం కలుగుతుంది.నాగ శాస్త్రం, గరుడ శాస్త్రం ఉన్న విధంగానే కాకి శాస్త్రం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక కాకికి దానం చేయడం వల్ల పితృ దేవతలకు శాంతి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ప్రతి అమావాస్యకు పితృదేవతలను గుర్తు చేసుకొని కాకికి దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని వారి ఆత్మ శాంతిస్తుందని చెప్పవచ్చు.

Also Read:  ప్చ్.. కరోనా బారిన పడిన మరో హీరోయిన్ !