spot_img
HomeజాతీయంStolen In Bihar : బీహార్‌లో వింత దోపిడీ: చోరీకి గురైన 60 అడుగుల వంతెన

Stolen In Bihar : బీహార్‌లో వింత దోపిడీ: చోరీకి గురైన 60 అడుగుల వంతెన

Stolen In Bihar : బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగలు నిలువుదోపిడీ చేశారు. ఓ దొంగల ముఠా ఏకంగా ఇనుప వంతెనను దొంగిలించి అసాధారణ దోపిడీకి పాల్పడింది.. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ బ్రిడ్జిని కూల్చివేసేందుకు గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ మిషన్లను ఉపయోగించి దొంగలు ఇనుప స్క్రాప్ మెటల్‌తో పరారయ్యారు.

నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను కూల్చివేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసేసరికి ఇనుప వంతెన మాయమైంది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు అయ్యింది.

నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ కొందరు వ్యక్తులు శిథిలావస్థలో ఉన్న పాడుబడిన ఇనుప వంతెన వద్దకు వచ్చి జేసీబీ యంత్రాలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో పూర్తిగా కూల్చివేశారని గ్రామస్థులు తెలిపారు.

60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ శాఖ అధికారులు నస్రీగంజ్ పోలీస్ స్టేషన్‌లో దొంగలపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

“ఇటువంటి నిర్మాణం.. మరమ్మతు పనులు నెమ్మదిగా జరుగుతున్నందున గ్రామస్థులు ఇది నిజమేనని అనుకున్నారు. ఇది దొంగల పని అని అనుమానించలేదు. అదే దొంగలకు వరమైందని అధికారులు తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Oktelugu Epaper
Exit mobile version