కరోనా బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు

కొవిడ్ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొవిడ్ మృతుల కుటుంబాలకు రిలీఫ్ కలిగించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారి కుటుంబాలకు సాయం అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆరు వారాల్లోగా ఎంత సాయం చేస్తారు? ఎలా చేస్తారు? విధి విధానాలేమిటి అనే వాటిపై ప్రశ్నలు సంధించింది. కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాల్సని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పింది. ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : June 30, 2021 6:11 pm
Follow us on


కొవిడ్ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొవిడ్ మృతుల కుటుంబాలకు రిలీఫ్ కలిగించే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారి కుటుంబాలకు సాయం అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆరు వారాల్లోగా ఎంత సాయం చేస్తారు? ఎలా చేస్తారు? విధి విధానాలేమిటి అనే వాటిపై ప్రశ్నలు సంధించింది.

కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాల్సని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పింది. ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో వారందరికి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది.

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కొంత మంది సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాధిత కుటుంబాలకు నాలుగు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సూచించింది. అయితే కేంద్రం తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. ఒకవేళ విపత్తు సహాయ నిధి కింద మొత్తాన్ని వారికి ఇచ్చినట్లయితే తర్వాత విపత్తు వస్తే నిధులు ఉండవని తేల్చింది. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

కేంద్రం వాదనలు విన్నసుప్రీంకోర్టు ససేమిరా అంది. బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని స్పష్టం చేసింది. అయితే నాలుగు లక్షలు కాకుండా ఎంత ఇస్తారో చెప్పాలని ఆదేశించింది. దీంతో రాష్ర్టాలకు సైతం ఊరట లభించనుంది. సుప్రీంకోర్టు చొరవతో కేంద్రం సాయం చేయడానికి ముందుకు రావడంతో కరోనా బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.