https://oktelugu.com/

SIM Card Rules: సిమ్ కార్డు జారీపై కఠిన నిబంధనలు.. ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా

‘డాట్’ నిబంధనల ప్రకారం.. సిమ్ కార్డులు వినియోగించేవారు ఒకసారి ఒక నెంబర్ ను యాక్టివేట్ చేసిన తరువాత.. అదే నెంబర్ పై మరొకరికి జారీ చేసే అవకాశం ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 2, 2023 4:49 pm
    govt-tightens-rules-around-
    Follow us on

    SIM Card Rules: మనుషుల మధ్య కమ్యూనికేషన్ కోసం నేటి కాలంలో మొబైల్ తప్పనిసరి. ఒక్కో మొబైల్ లో రెండు సిమ్ కార్డులు వేసుకుంటూ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సిమ్ కార్డు తీసుకోవడానికి పెద్ద ప్రయాస ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ఆన్లైన్లో ప్రక్రియ చేపట్టి కొత్త సిమ్ కార్డును చేతిలో పెడుతున్నారు. సిమ్ కార్డు జారీ చేయడంలో ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. వీటి జారీలో లోపాలు ఏర్పడుతున్నారు. కొందరు సిమ్ కార్డు షాపువారు ఒకే నెంబర్ ను ఇద్దరికి జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో నిజమైన వినియోగదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అదేంటంటే?

    డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సిమ్ కార్డులను విక్రియిచేవారి విషయంలో కఠిన నిబంధనలు పెట్టనుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకే నెంబర్ పై ఎక్కువ సిమ్ కార్డులు జారీ చేసేవారిని ఇవి అరికట్టే అవకాశం ఉందని డాట్ భావిస్తోంది. ఈ నిబంధనలతో కొనుగోలుదారులకు కూడా ఉపశమనం కలిగే అవకశం ఉంది. ఎంతో కాలంగా తమ నెంబర్ తో మరొకరు సిమ్ కార్డులు తీసుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇంతకాలం ఈ సమస్యపై సుదీర్ఘంగా ఆలోచించిన టెలీకమ్యూనికేషన్ ఫైనల్ గా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.

    ‘డాట్’ నిబంధనల ప్రకారం.. సిమ్ కార్డులు వినియోగించేవారు ఒకసారి ఒక నెంబర్ ను యాక్టివేట్ చేసిన తరువాత.. అదే నెంబర్ పై మరొకరికి జారీ చేసే అవకాశం ఉండదు. అంతకముందు సిమ్ కార్డులు అమ్మేవారు తమ షాపు వివరాలను రికార్డు చేయాలి. ఈ రికార్డలు ప్రకారం పోలీసులు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఆ తరువాత ప్రతి సిమ్ కార్డు దుకాణానికి ఒక కార్పొరేట్ ఐడీ ఇస్తారు. ఈ ఐడీ లేకుండా సిమ్ ను విక్రయించే ఛాన్స్ అస్సలు ఉండదు. అంతేకాకుండా ప్రతీ మొబైల్ స్టోర్ ‘డాట్’ కింద నమోదు చేసుకోవడానికి ఆధార్, పాన్, పాస్ పోర్ట్, జీఎస్టీ తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత షాప్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిష్టర్ నెంబర్ లేకుండా సిమ్ విక్రయిస్తే షాప్ బ్లాక్ చేయబడుతుంది. అంతేకాకుండా దాదాపు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

    ఒక వినియోగదారుల విషయంలో ఒక వ్యక్తి తన సిమ్ కార్డును పోగొట్టుకున్నా.. కట్ చేసినా వెంటనే వెరిఫికేషన్ కోసం వెళ్లాలి. ఒక నెంబర్ పై సిమ్ కార్డు నమోదైతే ఆ నెంబర్ ను వినియోగదారుడు తనంతట తాను రద్దు చేసుకున్నట్లు ప్రకటించాలి. అప్పుడే అదే నెంబర్ పై వేరొకరికి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా ఒకే నెంబర్ మరొకరికి వినియోగదారుడి అనుమతి లేకుండా జారీ చేస్తే చర్యలు తప్పవని డాట్ వివరించింది.