https://oktelugu.com/

Prabhas: ఆ ప్రశ్నకు పబ్లిక్ లో తెల్ల ముఖం వేసిన ప్రభాస్… అయ్యో పరువు తీసేస్తున్నారే!

శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కి కల్కి యూనిట్ నుండి ప్రభాస్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ లతో పాటు రానా హాజరయ్యారు. ప్రెస్ మీట్లో అమెరికన్ మీడియా అడిగే ప్రశ్నలకు రానా, కమల్ హాసన్ తడబడకుండా సమాధానాలు చెప్పారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 2, 2023 / 04:42 PM IST
    Follow us on

    Prabhas: ప్రభాస్ మితభాషి. బహు సిగ్గరి అంటారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదైనా… వేదికల మీద హుందాగా వ్యవహరించాలి. సందర్భం ఏదైనా ధీటుగా ఎదుర్కోవాలి. ప్రభాస్ కి ఇంగ్లీష్ రాదంటూ యాంటీ ఫ్యాన్స్ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 మూవీ ప్రఖ్యాత శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొనే గౌరవం దక్కించుకుంది. శాన్ డియాగో ఈవెంట్లో పాల్గొన్న మొదటి ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.

    శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కి కల్కి యూనిట్ నుండి ప్రభాస్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ లతో పాటు రానా హాజరయ్యారు. ప్రెస్ మీట్లో అమెరికన్ మీడియా అడిగే ప్రశ్నలకు రానా, కమల్ హాసన్ తడబడకుండా సమాధానాలు చెప్పారు. ప్రభాస్ మాత్రం ఇబ్బంది పడ్డారు. ఆయన పదాలు వెతుక్కుంటూ పొడిపొడిగా మాట్లాడటం అందరూ గమనించారు. ప్రభాస్ చెప్పలేక ఇబ్బంది పడిన ప్రశ్నలను రానా అందుకుని చెప్పాడు.

    ఇదిలా ఉంటే ప్రభాస్ మరొక చిత్రం సలార్ టైటిల్ అర్థం ఏమిటో చెప్పాలని ఇంగ్లీష్ రిపోర్టర్ అడిగారు. అమెరికన్ ఇంగ్లీష్ లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడటం వలన ప్రభాస్ కి అర్థం కాలేదు. ఆయన ఏమీ చెప్పకుండా ఉండిపోయాడు. ఈ వీడియోను యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ కి ఇంగ్లీష్ రాదని ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    మరోవైపు సలార్ విడుదలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ డిసెంబర్ 22కి వాయిదా పడిన విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి తెస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ డంకి, ప్రభాస్ సలార్ పోటీపడనున్నాయి. ఇద్దరు బడా స్టార్స్ మధ్య యుద్ధం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కల్కి వచ్చే ఏడాది విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ షూటింగ్ జరుపుకుంటుంది.