Best Cars: కార్లపై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో 7 సీటర్ కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెకేషన్ ప్లాన్ కోసం ఈ కారు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా భారీ ఇంజన్ తో పాటు విశాలమైన స్పేస్ కలిగి ఉన్నందున వీటిపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పటి వరకు 7 సీటర్ కారు అంటే మారుతి సుజుకీ ఎర్టీగాలు మాత్రమే ఫేమస్ గా మిగిలాయి. కానీ తాజాగా రెనాల్ట్ కంపెనీ 7 సీటర్ ను ఇటీవల భారత్ లో ఆవిష్కరించింది. ఈ కారు విశేషాలేంటో ఒకసారి చూద్దాం..
7 సీటర్ కారుకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో రెనాల్డ్ కంపెనీ ట్రైబర్ 7 సీటర్ ఎంపీవీ కారును ఇటీవల ఆవిష్కరించింది. ట్రైబర్ 7 సీటర్ 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఫ్యూయెల్ ను కలిగి ఉంది. దీని ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో కలిపి ఉంది. త్వరలో ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తో ఆవిష్కరించే అవకాశం ఉంది. ట్రైబర్ 7 లీటర్ కు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
భారతీయ మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ ధర రూ.6.34 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. 7సీటర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకుంటున్నారు. ఈ మోడల్ ఫీచర్ల విషయానికొస్తే 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫెటైన్మెంట్ సిస్టమ్, 84 లటర్ బూట్ స్పేస్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్రైవర్ కు అనుకూలమైన సీటు, కూల్డ్ స్టోరేజ్, మౌంటెడ్ మ్యూజిక్, కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 7 సీటర్ అనగానే మారుతి సుజుకీ ఎర్టీగా పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు దానికి పోటీగా రెనాల్ట్ ట్రైబర్ 7 పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ధర విషయంలోనూ ఎర్టీగాతో ఇది పోటీ పడుతుంది. అయితే ఇందులో అప్డేట్ ఫీచర్స్ తో పాటు బలమైన ఇంజిన్ వ్యవస్థ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవలే దీనిని లాంచ్ చేయడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ముందు ముందు ఎలాంటి అమ్మకాలు జరుపుతుందో చూడాలి.