కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల నిబంధనలను సవరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిబంధనలలో ఓలా,ఉబెర్ లాంటి క్యాబ్ సంస్థలకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ సంస్థలతో పాటు ఇతర క్యాబ్ సేవల సంస్థలను మోటారు వాహనాల కేంద్రం తీసుకొచ్చింది. మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి క్యాబ్‌ల నిర్వాహక సంస్థలను తీసుకురావడంతో వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?
ఇకపై వాహనదారులకు తక్కువ ధరలకే క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 కాలుష్యాన్ని నియంత్రించడం, క్యాబ్ నిర్వాహకుల వ్యాపారంలో పారదర్శకత, ప్రయాణికులకు ప్రయోజనాలను చేకూర్చేందుకు 2020 మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలను నేడు విడుదల చేసింది. క్యాబ్ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న సర్ చార్జీలకు కేంద్రం చెక్ పెట్టింది.
Also Read: అమెజాన్ పై బ్యాన్ విధించాలంటున్న వ్యాపారులు.. ఏం జరిగిందంటే..?
డిమాండ్ ఉన్న సమయాల్లో ఎక్కువ మొతంలో వసూలు చేస్తున్న 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. క్యాబ్ సంస్థలు బేస్ ఛార్జీలలో అందించే డిస్కౌంట్ ను కేంద్రం 50 శాతానికే పరిమితం చేసింది. బేస్ చార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారతాయని పేర్కొంది. డ్రైవర్లు సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికే చేరాలని సూచించింది. డ్రైవర్లకు .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
డ్రైవర్లు 12 గంటలకు మించి వాహనం నడపకూడదని.. 10 గంటల విరామం ఖచ్చితంగా తీసుకోవాలని వెల్లడించింది. అగ్రిగేటర్లు ఎక్కువ కంపెనీలలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవాలని తెలిపింది.