https://oktelugu.com/

పవన్ కి కూతురులా ఉంటుంది.. ఆమె హీరోయిన్ ఏంటి ?

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో 27వ సినిమా గా తెరకెక్కుతోందనే సంగతి కూడా తెలిసందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ నటి జాక్విలిన్ నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఏది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ […]

Written By:
  • admin
  • , Updated On : November 27, 2020 / 06:59 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లో 27వ సినిమా గా తెరకెక్కుతోందనే సంగతి కూడా తెలిసందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ నటి జాక్విలిన్ నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఏది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో క్రిష్ ఉన్నాడని.. అందుకు కారణం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి, హీరో క్యారెక్టర్ కు చాల ఏజ్ గ్యాప్ ఉంటుందని.. అందుకే క్రిష్ నభా వైపు ఆసక్తి చూపిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

    Also Read: పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?

    పైగా పవన్ కళ్యాణ్ కూడా నభా హీరోయిన్ అంటే ఒకే అన్నట్టు కూడా తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకి నభా ఫైనల్ చేసినట్టే అని త్వరలో షూటుంగ్ మొదలైతే నభా సెట్ లో అడుగుపెడుతుందని కూడా తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే నభాకి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాలో జాక్విలిన్ నటిస్తుంది కాబట్టి.. నభాది సెకండ్ లీడ్ అంటున్నారు. ఏది ఏమైనా ఈ వార్తకు సంబంధించి మేకర్స్ ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి.. ఇది నిజం అని చెప్పలేము. కానీ నభా నటేష్ పవన్ కి కూతరులా ఉంటుందని.. మరి అలాంటి అమ్మాయిని పవన్ సరసన హీరోయిన్ గా ఎలా పెడతారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి?

    కాగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు 15 రోజుల పాటు ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్ కి కమిట్ అవ్వడంతో.. ఈ సినిమా మరింతగా ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయిందన్న వార్తలు వచ్చాయి. కాని డిసెంబర్ నుంచి క్రిష్ ఈ సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి చూడాలి ఏమవుతుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్