Goodfellows : వృద్ధాప్యం ఒక శాపంగా మారింది. కుమారులు ఉపాధి కోసం వెళ్లిపోవడం.. భాగస్వామి అయిన భార్య/భర్త చనిపోవడంతో చాలా మంది దిక్కులేని పక్షుల్లో ఒంటరిగా వృద్ధులు నలిగిపోతున్నారు. కొంతమంది ఒంటరితనం భరించలేక ఉసురు తీసుకుంటున్నారు. అలాంటి వృద్ధులను కడుపులో పెట్టుకొని చూసుకునేందుకు ఒక అంకుర సంస్థ ముందుకొచ్చింది. దాని ఉద్దేశం వృద్ధులకు సేవ చేయడమే. ఈ వినూత్న స్టార్టప్ నచ్చి ఏకంగా టాటా చైర్మన్ రతన్ టాటా పెట్టుబడికి ముందుకు రావడం విశేషం.స్వయంగా ఆయన పాల్గొని దీన్ని లాంచ్ చేశారు.

సీనియర్ సిటిజన్‌లకు తోడుగా ఉండేందుకు యువ గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పించే ‘గుడ్‌ఫెలోస్’ అనే పరోపకార స్టార్టప్ మంగళవారం ముంబైలో ప్రారంభమైంది. అక్కడ పనిచేసే ‘గుడ్‌ఫెలోస్’ సేవకు అంకితమవుతారు. వృద్ధులతో సంబంధాలను పెంపొందించడం ద్వారా సంస్థ వృద్ధులకు మద్దతు, సహాయం అందించడానికి ప్రయత్నిస్తుంది.
భారతదేశంలో 15 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్లు ఒంటరిగా జీవిస్తున్నారు. భాగస్వామిని కోల్పోవడం వల్ల లేదా కుటుంబాలు దూరం కావడం వల్ల, ఒంటరిగా మిగిలిపోతున్నారు. వారికి ఈ గుడ్ ఫెలోస్ సహాయ సహకారాలు అందిస్తారు. ‘గుడ్‌ఫెలోస్’లోని ఉద్యోగులు శిక్షణ పొందారు. ఒక ప్రామాణికమైన సేవను అందించేందుకు.. అధిక భావోద్వేగ గుణాన్ని, వారిలోని సేవా గుణాన్ని నిర్ధారించడానికి సైకోమెట్రిక్ పరీక్ష ద్వారా క్షుణ్ణంగా పరిశీలించబడుతారు. సేవ చేసే గల వారినే ఈ ఉద్యోగాల్లో నియమించి వృద్ధుల వద్దకు ఉద్యోగం కోసం పంపిస్తారు.
స్టార్టప్ కేవలం ఉద్యోగాలను ఇవ్వడం మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్‌లకు అర్ధవంతమైన సంబంధాలను అందించడం ద్వారా దాని చందాదారులకు మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. లాంచ్‌కు హాజరైన టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా ఈ స్టార్టప్ సేవలకు ఫిదా అయ్యి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు.. ఆర్టిస్ట్ శ్రియా పిల్గావ్కర్, కంటెంట్ క్రియేటర్ విరాజ్ ఘేలానీ కూడా వారి తాతలను తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘Goodfellows’ దాని పరీక్ష దశలోనే అధిక, సానుకూల స్పందనను పొందింది. త్వరలో పూణే, చెన్నై మరియు బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. 800 మంది యువ గ్రాడ్యుయేట్లు ఉద్యోగులుగా నియమించబడ్డారు. వృద్ధుల వద్ద విశ్వసనీయులుగా పనిచేయడానికి ‘గుడ్‌ఫెలోస్’కి దరఖాస్తు చేసుకున్నారు. ముంబైలో ఉద్యోగం చేయాల్సిన 20 మంది మాత్రమే ఎంపిక చేశారు.
వృద్ధుల కోసం సౌకర్యవంతమైన, స్నేహపూర్వక, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, ‘గుడ్‌ఫెలోస్’ చాలా తరచుగా ఒకరి నుంచి మరొకరికి పంపబడుతారు. సీనియర్లు స్నేహాన్ని కొనసాగించగలరని.. తద్వారా నిజమైన భావోద్వేగ అనుభవాన్ని పెంపొందించుకునేలా కంపెనీ ఇలా చేస్తుందన్నమాట..
‘గుడ్‌ఫెలోస్’ వ్యవస్థాపకుడు జనరల్ మేనేజర్ అయిన శంతను నాయుడు మాట్లాడుతూ “స్టార్ట్-అప్ వివిధ వ్యక్తులకు సాంగత్యాన్ని కల్పిస్తుంది.. కొంతమందికి ఇది సినిమా చూడటం, గత కథలు చెప్పడం, నడకకు వెళ్లడం లేదా కలిసి ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం’ చేస్తుంది. మేము అన్నింటికీ అనుగుణంగా ఉన్నాము. దాని బీటా దశలో వృద్ధులకు ‘గుడ్‌ఫెలోస్’తో ఎంత సేంద్రీయంగా బంధం కలిగి ఉన్నారో మేము కనుగొన్నాం. మా వెంచర్‌లో టాటా పెట్టుబడి పెట్టడం మా అంకితభావానికి ప్రోత్సాహానికి ఒక పెద్ద మూలం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
వృద్ధుల సంఘాన్ని నిర్మించడానికి.. బలోపేతం చేయడానికి, ‘గుడ్‌ఫెలోస్’ నెలవారీ ఈవెంట్‌లను కూడా నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లు ప్రతిఒక్కరూ ఒకరితో ఒకరు బంధం కోసం ఆనందాన్ని సాంగత్యాన్ని పెంచడానికి దోహదపడుతాయి. వృద్ధులు వారి స్థోమతకు అనుగుణంగా చిన్న చందా రుసుమును చెల్లించడం ద్వారా సేవను పొందవచ్చు. అయితే మొదటి నెల ఉచితంగా ఇస్తున్నారు ‘గుడ్‌ఫెలోస్’ కాన్సెప్ట్‌ను వాస్తవంగా చూడకుండా అర్థం చేసుకోవడం కష్టం, అందుకే కంపెనీ మొదట్లో ఛార్జ్ చేయకుండా ఉచితంగా వృద్ధులకు సేవను కల్పిస్తోంది.
టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ: “గుడ్‌ఫెలోస్ సృష్టించిన రెండు తరాల మధ్య బంధాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. భారతదేశంలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నాయి. గుడ్‌ఫెలోస్‌లోని యువ జట్టు ఎదగడానికి పెట్టుబడి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను’ అంటూ కొత్త స్టార్టప్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోని వృద్ధుల కోసం కూడా వారి బాగోగులు చూసుకోవడానికి ఒక స్టార్టప్ రెడీ కావడం.. ఈ ముదిమి వయసులో వారికి స్వాంతన చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త కంపెనీ వృద్ధుల పాలిట కల్పతరువుగా చెప్పొచ్చు.