టీచర్ల హేతుబద్దీకరణ.. పోస్టుల భర్తీ ఉంటుందా?

పాఠశాలల హేతుబద్దీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రంగం సిద్ధమైంది. అవసరమైన పాఠశాలల్లో ఉఫాధ్యాయుల నియామకం అవసరం లేని పాఠశాలల నుంచి బదిలీ చేయడం వంటి ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే పాఠశాలల విద్యార్థుల సంఖ్యపై నివేదికలు తెప్పించుకుంది. జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు పంపించారు. పాఠశాలల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. హేతుబద్దీకరణను ప్రభుత్వం 2015లో పూర్తి చేసింది. ఆ సందర్భంగా ఇచ్చిన జీవో 11,17ల్లో […]

Written By: Srinivas, Updated On : August 12, 2021 10:14 am
Follow us on


పాఠశాలల హేతుబద్దీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రంగం సిద్ధమైంది. అవసరమైన పాఠశాలల్లో ఉఫాధ్యాయుల నియామకం అవసరం లేని పాఠశాలల నుంచి బదిలీ చేయడం వంటి ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే పాఠశాలల విద్యార్థుల సంఖ్యపై నివేదికలు తెప్పించుకుంది. జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు పంపించారు. పాఠశాలల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.

హేతుబద్దీకరణను ప్రభుత్వం 2015లో పూర్తి చేసింది. ఆ సందర్భంగా ఇచ్చిన జీవో 11,17ల్లో కొన్ని మార్పులు చేర్పులతో కొత్త జీవో తీసుకురానుంది. గత విద్యాసంవత్సరం 2020-21 జిల్లా పాఠశాలల విద్యా సమాచారంలో నమోదైన విద్యార్థుల సంఖ్యను ఈసారి ప్రామాణికంగా తీసుకుంటారు. ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు. మంజూరు చేసిన పోస్టులెన్ని, పని చేస్తున్న వారెందరు, ఖాళీలెన్ని తదితర వివరాలు సిద్ధం చేసుకోవాలని శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు.

గతంలో ఇచ్చిన జీవో 11,17ల మార్గదర్శకాలను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. అవసరానికి మించి ఉపాధ్యాయుంటే వారిని ఎక్కడికి పంపాలో కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్ జీటీలు) ఎక్కువగా ఉన్నప్పుడు వారికి స్కూల్ అసిస్టెంట్ అర్హతలుంటే ఉన్నత పాఠశాలల్లో తాత్కాలిక సర్దుబాటు ేయవచ్చని తెలుస్తోంది.

ఒక విద్యార్థి లేని పాఠశాలకు సైతం ఒక ఉపాధ్యాయ పోస్టు ఉంచాలని సూచించినట్లు సమాచారం. రాష్ర్టంలో ఆంగ్లం బోధించే సబ్జెక్టు టీచర్లు అవసరానికి మించి ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో హేతుబద్దీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరం కన్నా ఎక్కువ ఉన్న పోస్టులను తక్కువగా ఉన్న పాఠశాలలకు బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు సుగమం చేసింది.