Double engine: రాబోయేది ‘డబుల్ ఇంజిన్’ సర్కారే: మోదీ

Double engine government in Telangana: రెండ్రోజులుగా తెలంగాణ కషాయ రంగును పులుముకుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో బీజేపీ అగ్రనేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. గడిచిన రెండ్రోజులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించగా నేటి సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తొలుత తెలుగులో మాట్లాడిన మోదీ ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తల్లో జోష్ నింపారు. […]

Written By: NARESH, Updated On : July 3, 2022 9:48 pm
Follow us on

Double engine government in Telangana: రెండ్రోజులుగా తెలంగాణ కషాయ రంగును పులుముకుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో బీజేపీ అగ్రనేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. గడిచిన రెండ్రోజులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించగా నేటి సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

తొలుత తెలుగులో మాట్లాడిన మోదీ ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తల్లో జోష్ నింపారు. సోదర సోదరీమణులకు నమస్కారాలు.. ఎంతో దూరం నుంచి వచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూనే.. తెలంగాణ నేల తల్లికి వందనాలు సమర్పించారు. తెలంగాణ గడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని.. యావత్ తెలంగాణ ఇక్కడ మైదానంలో కూర్చున్నట్లు కన్పిస్తుందని తెలిపారు.

హైదరాబాద్ నగరం అన్ని రంగాల వారికి అండగా నిలుస్తుందని.. ప్రాచీన సంస్కృతి, పరక్రమానికి తెలంగాణ ప్రతీక అంటూ కీర్తించారు. దేశ ప్రజలందరికీ యాదాద్రి నరసింహ స్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షను మోదీ వ్యక్తం చేశారు. అనంతరం మోదీ హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి మోదీ తన ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కేంద్రం ఏం చేయబోతుందో చెప్పుకొచ్చారు. తెలంగాణలో 35వేల కోట్లతో ఐదు భారీ సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టనుందని తెలిపారు.

సబ్ కా సాథ్.. సాబ్ కా వికాస్ మంత్రంతో బీజేపీ సర్కారు గత ఎనిమిదేళ్లుగా ముందుకు సాగుతుందన్నారు. దళితులు, ఆదివాసీ, మహిళల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో కేంద్రం ప్రతీ కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణలో మెగా టైక్స్ టైల్ పార్కు చేస్తామన్నారు.

తమ పాలనలో హైవేలు రెట్టింపు అయ్యాయని.. పంటలకు కనీస మద్దతు ధర పెంచామని.. రామగుండం ఎరువు పరిశ్రమను పునరుద్ధరించామని చెప్పారు. ఆవిష్కరణల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీస్సుల కోసమే తాను వచ్చానని వెల్లడించారు.

కాగా మోదీ రాకకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు, మాటలయుద్ధానికి దిగారు. అయినప్పటికీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై ఎక్కడ కూడా విమర్శలు చేయకపోవడం గమనార్హం. ఇదొక్కటి మినహా మోదీ ప్రసంగం మొత్తం బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా సాగింది. ఇదిలా ఉంటే చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విజయ సంకల్ప వేదికగా కషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.