కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మార్చి నెల నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అన్ లాక్ సడలింపుల్లో విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించినా దేశంలో పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రం దేశీయ విమాన సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రత్యేక విమానాలకు అనుమతులిచ్చిన కేంద్రం ఇకపై దాదాపు పూరిస్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: రైతు ఉద్యమం: మోడీకి మేధావుల సెగ
దాదాపు 80 శాతం విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. క్రమంగా విమాన సర్వీసులను పెంచుతూ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు పౌర విమానయాన శాఖ ప్రయత్నాలు చేస్తోంది. గతన్ నెల 11వ తేదీన 70 శాతం విమాన సర్వీసులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
Also Read: మోడీ సర్కార్ అష్టదిగ్బంధనం.. కేంద్రానికి దారేది?
ఈ నెల ఆ సర్వీసులను ఏకంగా 80 శాతానికి పెంచడంతో రాబోయే రోజుల్లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మే నెలలో 25,000 మందితో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కాగా నవంబర్ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షలకు చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుకోవడానికి విమాన సర్వీసులే ప్రయోజనకరం అని ప్రయాణికులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
మరోవైపు దేశంలో రోజురోజుకు కొత్త కేసులు తగ్గుతుండటంతో మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రజలు భావిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు భారీగా తగ్గడం గమనార్హం. విమాన సర్వీసులతో పాటు రైలు సర్వీసులు కూడా పూర్తిస్థాయిలో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Domestic flights allowed at 80 percent of pre covid levels from today said civil aviation minister hardeep singh puri
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com