
శాసనసభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమంపై చర్చకు ప్రతిపక్షం నుంచి సలహాలు వస్తాయని చూశామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం మాత్రం రాజకీయం చేసేందుకే అసెంబ్లీని వాడుకుంటున్నదని, సభ సజావుగా జరగకుండా అడ్డుకుని సస్పెన్షన్ కోరుకున్నారని జగన్ ఆరోపించారు. సభలో చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ ..ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.79,806 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఏడాదికి రూ.15,419 కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లో రూ.58,729 కోట్లు ఖర్చు చేశాం. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బలహీనవర్గాలు గుర్తొస్తాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్, బీసీ కార్పొరేషన్లు అన్నారు. 2 నెలల్లో ఎన్నికలొస్తాయనగా పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచారని విమర్శించారు.