జీరో కరోనా దిశగా ఢిల్లీ?

ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మొదటి,రెండో దశల్లో అల్లాడిన ఢిల్లీ ప్రస్తుతం కోలుకుంటోంది. రోజుకు 623 కేసులు నమోదు కావడంతో భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాష్ర్టానికి తక్కువ, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ అయిన ఢిల్లీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రెండు కోట్ల జనాభా గల ఇక్కడ సెకండ్ వేవ్ లో రోజుకు 14 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్రాంతంలో ఈ తరహా కేసులు రావడం సహజమే. […]

Written By: Srinivas, Updated On : June 3, 2021 10:12 am
Follow us on

ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మొదటి,రెండో దశల్లో అల్లాడిన ఢిల్లీ ప్రస్తుతం కోలుకుంటోంది. రోజుకు 623 కేసులు నమోదు కావడంతో భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. రాష్ర్టానికి తక్కువ, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ అయిన ఢిల్లీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రెండు కోట్ల జనాభా గల ఇక్కడ సెకండ్ వేవ్ లో రోజుకు 14 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం.

జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్రాంతంలో ఈ తరహా కేసులు రావడం సహజమే. ఈ భయానక పరిస్థితులను అనుభవించిన ఢిల్లీ ఇప్పుడు కేసులు తగ్గి ప్రశాంతమైన పరిస్థితి ఏర్పడుతోంది. గత కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో వారంరోజులుగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి లోపు నమదవుతూ వస్తోంది.

దేశంలో జనసాంద్రతను బట్టి చూస్తే అతి తక్కువ కేసులునమోదవుతున్న ప్రాంతంగా ఢిల్లీ నిలుస్తోంది. యాక్టవ్ కేసుల సంఖ్య 10వేల స్థాయికి వచ్చింది. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోయింది.ఈ వారం నుంచే అక్కడ లాక్ డౌన్ ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రోజుకు వేల కేసుల నుంచి వందల కేసులకు మారింది. కరోనా దాదాపు తగ్గిపోయినట్లే. అయితే జీరో కరోనా కేసులు సాధ్యమేమో చూడాలి మరి. తగ్గుదల ఇలాగే కొనసాగితే జీరో కేసులు కూడా సాధ్యమే అని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత తగ్గుదలను గమనిస్తే కరోనా కేసుల్లో గ్రోత్ రేటు లేదు. తగ్గుదల కొనసాగుతోన్నందున జీరో కరోనా డే ఆశించవచ్చు.