https://oktelugu.com/

ప్చ్… ఛాన్స్ ల కోసం తెలుగు బ్యూటీ ఓపెన్ ఆఫర్ !

అచ్చ తెలుగు భామ ‘ఇషా రెబ్బా’ హీరోయిన్ గా నిలబడటానికి నానా కష్టాలు పడుతుంది. అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సోకుల షో చేస్తూ ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతుంది. ఎంత చేసినా, ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ కి దిగినా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఈషా రెబ్బాని అసలు పట్టించుకోవడం లేదు. నిజానికి ఈ డస్కీ బ్యూటీలో మంచి టాలెంట్ ఉంది, కాకపోతే […]

Written By:
  • admin
  • , Updated On : June 3, 2021 / 09:57 AM IST
    Follow us on

    అచ్చ తెలుగు భామ ‘ఇషా రెబ్బా’ హీరోయిన్ గా నిలబడటానికి నానా కష్టాలు పడుతుంది. అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సోకుల షో చేస్తూ ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతుంది. ఎంత చేసినా, ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ కి దిగినా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఈషా రెబ్బాని అసలు పట్టించుకోవడం లేదు.

    నిజానికి ఈ డస్కీ బ్యూటీలో మంచి టాలెంట్ ఉంది, కాకపోతే టాలీవుడ్ కి ఎందుకో ఈ బ్యూటీ బాగా చులకన అయిపోయింది. ఈషాని ఒక హీరోయిన్ గా గుర్తించడానికి కూడా తెలుగు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. పెద్ద అవకాశాలు ఎలాగూ ఇవ్వరు, కనీసం చిన్నా చితకా సినిమాల్లో కూడా ఈ బ్యూటీకి ఛాన్స్ లు ఇవ్వట్లేదు.

    అందుకే ఇక ఇలాగే ఉంటే, తనకు వయసు ఎక్కువై చివరకు లైఫ్ లో సెటిల్ అవ్వకముందే ఫేడ్ అవుట్ అయిపోతాననే భయం పట్టుకుంది. మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చింది. ఇక తమిళంలో తన లక్ ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. తాజాగా ఈ బ్యూటీ తన తమిళ సినిమా అవకాశాల కోసం, ఇంటర్వ్యూల కోసం వీరిని సంప్రదించండి అంటూ

    తన మేనేజర్ల, పీఆర్వోల డీటెయిల్స్ ని తన సోషల్ మీడియా వేదిక పై ఉంచింది. పాపం ఎంతగా కక్కుర్తి పడకపోతే ఈ బ్యూటీ ఇలా ఛాన్స్ ల కోసం పబ్లిక్ ముందుకు వస్తోంది. కనీసం తమిళంలోనైనా కెరీర్ ని బిల్డ్ చేసుకుందామని ఈషా రెబ్బా ఉబలాట పడుతోంది. ఆల్ రెడీ తమిళ్ మీడియాతో తానూ బికినీకి కూడా రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.