
ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు.
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం సులభమే అయినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ లేని సమర్థవంతంగా పని చేసే వ్యాక్సిన్ ను తయారు చేయడం చాలా కష్టం. అయితే ఒడిశాకు చెందిన ప్రహ్లాద్ బిసీ అనే ఏడో తరగతి చదివిన విద్యార్థి దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను తయారు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వ్యాక్సిన్ తయారీ పనులను ప్రారంభించాడు.
చివరకు అనేక ప్రయోగాలు చేసి కరోనా వ్యాక్సిన్ ను తయారు చేశాడు. వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేద్దామని భావించి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వాలంటూ అధికారులకు ఈ మెయిల్ చేశాడు. ఆ ఈ మెయిల్ చూసి షాక్ అవ్వడం అధికారుల వంతయింది. వెంటనే అధికారులు అతని ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో కెమికల్స్ ను పరిశీలించి షాక్ అయ్యారు.
ఆ అధికారులు అతనని వ్యాక్సిన్ ఎలా తయారు చేశావని ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రహ్లాద్ గతంలో ఏవైనా మందులు తయారు చేశాడా…? వాటిని ఎవరిపైనైనా ప్రయోగించాడా..? అనే విషయాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.