https://oktelugu.com/

Third Wave Corona: థర్డ్ వేవ్ వచ్చినట్టే.. దేశంలో కరోనా కల్లోలం షురూ!

Third Wave Corona: మొదటి వేవ్ నుంచి దేశాన్ని లాక్ డౌన్ పెట్టి కాపాడారు. సెకండ్ వేవ్ ను లైట్ తీసుకొని లక్షల మందిని కోల్పోయాం.. ఇప్పుడు మూడో వేవ్ ముంగిట ఉన్నాం.. రూపాంతరం చెందిన కరోనా ‘ఒమిక్రాన్’ రూపంలో దేశంలో విరుచుకుపడుతోంది. దీంతో నిన్నా మొన్నటివరకూ చాపకింద నీరులా ఉన్న కరోనా ఇప్పుడు తన పంజా విసురుతోంది. భారత దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2022 1:11 pm
    Follow us on

    Third Wave Corona: మొదటి వేవ్ నుంచి దేశాన్ని లాక్ డౌన్ పెట్టి కాపాడారు. సెకండ్ వేవ్ ను లైట్ తీసుకొని లక్షల మందిని కోల్పోయాం.. ఇప్పుడు మూడో వేవ్ ముంగిట ఉన్నాం.. రూపాంతరం చెందిన కరోనా ‘ఒమిక్రాన్’ రూపంలో దేశంలో విరుచుకుపడుతోంది. దీంతో నిన్నా మొన్నటివరకూ చాపకింద నీరులా ఉన్న కరోనా ఇప్పుడు తన పంజా విసురుతోంది.

    భారత దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి దేశంలో థర్డ్ వేవ్ వచ్చినట్టేనని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి.. నిన్న కొత్తగా 1,17,100 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ఇలా జెట్ స్పీడుతో పెరగడంపై అంతటా ఆందోళన నెలకొంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 7.74 శాతానికి చేరింది.

    మహారాష్ట్రలో గురువారం 36265 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క ముంబై నగరంలోనే 20181 కేసులు బయటపడ్డాయి. బెంగాల్ లో 15421, ఢిల్లీలో 15097 కేసులు నమోదై పరిస్థితి అదుపుతప్పేలా కనిపిస్తోంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34 శాతానికి పెరిగింది.

    ఇక ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ప్రస్తుతం ఆ కేసులు 3007కి చేరాయి. కొత్తగా 377మందిలో కొత్త వేరియంట్ ను గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది దీని బారినపడ్డారు. ఢిల్లీలో ఆ సంఖ్య 465కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో 107 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో 28 కేసులు మాత్రమే వెలుగుచూశాయి.

    కరోనా ప్రస్తుతం దేశంలో విజృంభిస్తోంది. నిన్న 3 లక్షలకు చేరువలో ఉన్న క్రియాశీల కేసులు కాస్తా తాజాగా నాలుగు లక్షల చేరువకు వెళ్లాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 3,71,363కి పెరిగింది. చూస్తుంటే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చేలాగానే కనిపిస్తోంది. సో జనాలందరూ ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే ఈ మూడో వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.