Tollywood Star Heroes: జనరల్‌గా సెలబ్రిటీలు తాము సినిమాల్లో నటించినందుకుగాను రెమ్యునరేషన్ తీసుకుంటారు. తమ క్రేజ్, డిమాండ్‌ను బట్టి భారీ స్థాయిలోనే పారితోషకం అందుకుంటుంటారు. చిత్ర విజయం, అపజయంతో సంబంధం లేకుండా పిక్చర్‌లో యాక్ట్ చేసే ముందరనే సెలబ్రిటీలు తమ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక వేళ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోతే నష్టపోవాల్సింది నిర్మాత మాత్రమే. అయితే, కొందరు సెలబ్రిటీలు మాత్రం అలా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడాన్ని చూసి బాధపడిపోతుంటారు. అందులో టాలీవుడ్ తారలూ ఉన్నారు.
ఫిల్మ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాని క్రమంలో ఈ టాలీవుడ్ తారలు తమ రెమ్యునరేషన్‌లో కొంత భాగం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్‌కు తిరిగి ఇచ్చేశారు. వారు ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి మనసు గురించి అందరికీ తెలుసు. తన సినిమాలు ‘జాని, పులి’ అనుకున్న స్థాయిలో ఆడని క్రమంలో తన రెమ్యునరేషన్‌లో 40 శాతం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చేశాడు.
Also Read: ప్రముఖ ఓటీటీలో నేటి నుంచి ‘పుష్ప’ స్ట్రీమింగ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ వచ్చిన చిత్రం ‘ఖలేజా’. మహేశ్ లోని మరో కోణాన్ని ఈ పిక్చర్ ఆవిష్కరించింది. కానీ, సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండేందుకుగాను మహేశ్ తన రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాను నటించిన ‘ఆరెంజ్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగబాబుకు తన పారితోషికంలో 30 శాతం తిరిగి ఇచ్చేశాడు.
రామ్ చరణ్ -బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా ఉండేందుకుగాను చరణ్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యా వారికి రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేశారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ తను నటించిన ‘నరసింహుడు’ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలవగా, తన సగం రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడు. బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి కూడా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చిన తనకు మంచి మనసుందని చాటుకుంది. ‘పడి పడి లేచే మనసు’ సినిమా అనుకున్న స్థాయిలో ఆడని క్రమంలో తన రెమ్యునరేషన్ కంప్లీట్‌గా వెనక్కు ఇచ్చేసింది.
Also Read: ఎన్టీఆర్ ని బీట్ చేసిన చిరంజీవి మొదటి సినిమా… స్టార్ కాకముందే చిరు అద్భుత రికార్డు!