Viral Video: నదిలో పడవులు ఢీ.. 100 మంది గల్లంతు.. వైరల్ వీడియో

అసలే వానాకాలం.. నది జోరుగా ప్రవహిస్తోంది. గాలికి పడవులు కదిలిపోతున్నాయి. ఇలాంటి వేళ రెండు పడవులు దారితప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నదిలో దాదాపు 100 మంది గల్లంతయ్యారు. ఈ ఘోరం అస్సాం రాష్ట్రంలో విషాదం నింపింది. అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దాదాపు 100 మంది ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారని తెలిసింది. అసోంలోని జోర్హత్ నగరంలోని నిమాతి ఘాట్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర […]

Written By: NARESH, Updated On : September 8, 2021 6:50 pm
Follow us on

అసలే వానాకాలం.. నది జోరుగా ప్రవహిస్తోంది. గాలికి పడవులు కదిలిపోతున్నాయి. ఇలాంటి వేళ రెండు పడవులు దారితప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నదిలో దాదాపు 100 మంది గల్లంతయ్యారు. ఈ ఘోరం అస్సాం రాష్ట్రంలో విషాదం నింపింది.

అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దాదాపు 100 మంది ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారని తెలిసింది. అసోంలోని జోర్హత్ నగరంలోని నిమాతి ఘాట్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

బ్రహ్మపుత్ర నదిలోని దీవి మజూలీ నుంచి నిమాతి ఘాట్ వైపు ఒక పడవ వస్తోంది. నిమాలి ఘాట్ వైపు నుంచి మరో పడవ మజూలీకి వెళుతోంది. ఈ రెండు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో దాదాపు 100 మంది మునిగిపోయినట్టు సమాచారం. వెంటనే ఎన్టీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు స్పాట్ కు చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి.