జాతీయంChandrayaan 3 : జెండాలో మూన్.. మూన్ పై జెండా.. రెండూ ఒకటి కావు..

Chandrayaan 3 : జెండాలో మూన్.. మూన్ పై జెండా.. రెండూ ఒకటి కావు..

Chandrayaan 3 : చంద్రయాన్_2 విఫలమైన తర్వాత భారత్ దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకుంది. అందుకే చంద్రయాన్_3 ని పకడ్బందీగా ప్రయోగించింది. జూలై 14న ఎల్విఎం_ 3 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్_ 3 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 అంటే బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సులభంగా సేఫ్ గా లాండ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇస్రో ను కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు మిన్నంటాయి. ఈ సమయంలో భారత నెటిజన్లు పాకిస్తాన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు..

వాస్తవానికి పాకిస్తాన్ జాతీయ జెండాలో చందమామ ఉంటుంది. కాకపోతే అది అర్థ వృత్తాకారంలో ఉంటుంది. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అంతరిక్షంలో అంతంతమాత్రంగానే ప్రయోగాలు చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించి పోవడంతో అంతరిక్ష ప్రయోగాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టింది. దేశాభివృద్ధిని విస్మరించి కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ప్రోత్సహించడం మొదలుపెట్టింది. తన దేశ అవసరాలకు చైనా మీద ఆధారపడడం ప్రారంభించింది. చివరికి ఆ దేశానికి సంబంధించి సొంత నావిగేషన్ సిస్టం కూడా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇండియా మాత్రం అంతరిక్షంలో అంతకంతకు తన పాత్రను పెంచుకుంటూ పోతుంది. చంద్రుడి మీద రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలు రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ.. ఆ ఉపగ్రహం మీద నీటి జాడలు ఉన్నాయని తెలిపింది ఇస్రోనే. చంద్రయాన్_2 విఫలమైన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చంద్రయాన్_3 ని ఆకాశంలోకి వదిలింది. ఇస్రో ఊహించినట్టుగానే చంద్రుడి మీద విక్రం ల్యాండర్ విజయనాదం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో “జెండా మీద చంద్రుడు ఉండడం, చంద్రుడు మీద జెండా పాడడం బోత్ ఆర్ నాట్ సేమ్” అనే మీమ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగును దీనికి జోడించి పాకిస్తాన్ అంతరిక్ష సంస్థను భారత నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/VJViper_jd7/status/1694328548507660605?s=20

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Vikram 1 Launch : స్కై రూట్.. ప్రైవేట్ రాకెట్ విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే..

Vikram 1 Launch : ఇప్పటివరకు భారత అంతరిక్ష రంగంలోకి ఇస్రో పంపిన శాటిలైట్స్ మాత్రమే వెళ్లేవి. ఇప్పుడు భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన...

ISRO scientist resignations : ఇస్రోలో భారీగా సైంటిస్టుల రాజీనామాలు.. ఏం జరుగుతోంది.. రంగంలోకి కేంద్రం.. సంచలన నిర్ణయం

ISRO scientist resignations : ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌ఆర్‌వో) ఇటీవలి నెలల్లో తన అనుభవజ్ఞులైన సైంటిస్టులను కోల్పోతోంది. ఈ పరిణామం దేశంలోని అత్యంత ముఖ్యమైన అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....

AP Investment Ranking: దేశంలోనే ఏపీ 8వ స్థానం.. తెలంగాణకు ఎంతకు దిగజారిందంటే?

AP Investment Ranking: నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ (ఐఎఫ్‌ఐ) రాష్ట్రాల పెట్టుబడి వాతావరణాన్ని మరింత విస్తృతంగా అంచనా వేసే కొత్త సాధనం. గతంలో కేంద్రం నిర్వహించిన...
Oktelugu Epaper
Exit mobile version