Pawan Kalyan OG: తమిళ సినిమాలలో తన అద్భుత నటన ద్వారా గుర్తింపు పొందిన నటుడు అర్జున్ దాస్. ముఖ్యంగా సినిమాలలో తన ఆకర్షణీయమైన లోతైన గాత్రానికి పేరుగాంచిన నటుడు అర్జున్ దాస్. ఆయన డైలాగ్స్ కి, వాయిస్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తమిళంలోనే కాదు తెలుగులో కూడా అర్జున్ దాస్ కి మంచి పేరే ఉంది. కార్తీక్ ఖైదీ సినిమా, విజయ్ మాస్టర్ లాంటి తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల నుండి కూడా ప్రశంసలు పొందాడు. ఇక ఈ నటుడు ఇటీవల “బుట్టా బొమ్మ” సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం OGలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
సుజీత్ దర్శకత్వం వహించిన OGలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలో అర్జున్ దాస్ కూడా భాగమని సినిమా టీమ్ అధికారికంగా ధృవీకరించింది. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడం తన అదృష్టమని అర్జున్ దాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ మూడో షెడ్యూల్‌లో అర్జున్ దాస్ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలతో బిజీగా ఉన్న కానీ అన్ని సినిమాల కన్నా కూడా ఓజి పైన ప్రేక్షకులకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుంది అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టీజర్ గురించి ఒక వార్త సినీ వర్గాల్లో తెగ షికారు కొడుతోంది. అదేమిటి అంటే ఈ టీజర్ కి అర్జున్ టాస్ వాయిస్ ఓవర్ ఉంటుండట. టీజర్ లోని కథను వివరిస్తూ అర్జున్ దాస్ వాయిస్ బ్యాక్ గ్రౌండ్లో వస్తుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్త తెలియడంతో ఈ టీజర్ ని తన అద్భుతమైన గొంతుతో అర్జున్ దాస్ మరో లెవెల్ కి తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు సోషల్ మీడియా యూజర్స్.
OGకి సంగీతం దర్శకులుగా థమన్, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం