NFBS Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ఎన్ఎఫ్ బీఎస్. ఇది 1995లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇంటి పెద్ద కానీ ఇంటి యజమానురాలు అయినా మరణిస్తే రూ.20 వేలు అందజేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది రూ. 10 వేలుగా ఉండేది. 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వం దీన్ని రూ. 20 వేలుగానే చేసింది. దీంతో అకస్మాత్తుగా అయినా సాధారణ మరణం అయినా రూ.20 వేలు ఇస్తారు.
అమ్ ఆద్మీ బీమా, ఆపద్బంధు పథకాలకు దరఖాస్తులు వస్తున్నా దీనికి మాత్రం రావడం లేదు. దీనికి కారణం చాలా మందికి ఈ పథకం గురించి తెలియకపోవడమే. ఈ నేపథ్యంలో దీని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం కొరవడటంతో దీని గురించి ప్రజలకు తెలియకుండా పోతోంది. దీని వల్ల ప్రజలకు అవగాహన కలగడం లేదు.
దీని కోసం పంచాయతీ అయితే కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే కమిషనర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మరణించిన వెంటనే దరఖాస్తు చేస్తే ప్రభుత్వం రూ.20 వేలు అందజేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రచారం కల్పించడం లేదనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్ బీఎస్ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రూ.20 వేలు అందించే పథకం కావడంతో ఎంతో కొంత సాయం అందించినట్లు అవుతుంది. దీని గురించి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఇది చాలా మందికి తెలియడం లేదు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు దీని గురించి తగిన ప్రచారం కల్పించాల్సి ఉంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More