BR Ambedkar Death Anniversary: అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గం అనుసరణీయం. ప్రపంచానికే దారి చూపిన మహోన్నత వ్యక్తిగా అంబేద్కర్ ను కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ప్రజాస్వామ్య పరిరక్షణలో విలువలు బతికించడంలో ఆయన రచించిన రాజ్యాంగమే అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన అనుసరించిన మార్గమే ఆచరణీయం.

మానవాళి మనుగడకు మార్గం చూపిన మహోన్నత వ్యక్తి. సమాజ నిర్మాణంలో తనదైన శైలి చూపించిన మానవతామూర్తి. హక్కుల సాధనకు అంకురార్పణ చేసిన త్యాగనిరతి. ప్రపంచానికే దార్శనికుడు. రాజ్యాంగ రచనలో ఆయన చూపిన తెగువ సామాన్యమైనది కాదు. రాజ్యాంగ రచనకు ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. అకుంఠిత దీక్ష, పట్టుదల, చొరవతో ప్రపంచ రాజ్యాంగాలను ఔపోసన పట్టి అందులోని కొన్నింటిని తీసుకుని మన రాజ్యాంగాన్ని రచించడమంటే మాటలు కాదు.
అందుకు ఎంతో యుక్తి కావాలి. రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ ఎంతో కష్ట పడ్డారు. రాజ్యాంగ రచనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి మనకు ఓ చక్కని రాజ్యాంగం అందించడం విశేషం. అంబేద్కర్ జీవన విధానంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. భారత రాజ్యాంగ శిల్పిగా అంబేద్కర్ మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రజలకు లభించిన ప్రసాదాలుగా అభివర్ణించారు.
Also Read: అంబేద్కర్ వర్ధంతి: ఆయన విగ్రహాలకే కాదు ఆశయాలకు నేతల దండలేనా?
మానవతా విలువలు మూర్తీభవించిన మేధావిగా అంబేద్కర్ నిలిచారన్నారు. భారతదేశంలో అంబేద్కర్ చూపిన మార్గమే ఆదర్శనీయం. అంబేద్కర్ చూపిన మార్గంలోనే అందరం నడుద్దాం. ఆయనకు నిజమైన నివాళి అర్పిద్దాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుని నివాళి అర్పించారు.
Also Read: Exploitation of investors : నేను, నా దేశం.. ఓ పెట్టుబడిదారుడు..