Kamal Haasan :తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌కు నవంబర్ 22 వ తేదీన కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చిన కమల్ ఒంట్లో నలతగా ఉండి పలు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో వెళ్లి టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అవ్వగా. చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో కరోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ఆయను కుటుంబ సభ్యులు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన కమల్ హాసన్ …. రెండు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే ఒక టీవీ షోలో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్ కు నోటీసులు జారీ చేసింది.

Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !
ఇటీవలే కరోనా మహమ్మారి నుండి కోలుకున్న కమల్ హాసన్ ఓ టీవీ షోలో పాల్గొనడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ ప్రముఖ టీవీ షో లో కమల్ హాసన్ వెళ్లడం వల్ల అక్కడ కరోనా వ్యాప్తి ఏమైనా ఉంటుందేమోనని కరోనా వైరస్ అనేది అంత సాధారణంగా తగదని ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఈ షోలో పాల్గొన్న పై జాతీయ విపత్తుల చట్టం ప్రకారం… ఆయనకు నోటీసులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
Also Read: Actress Samantha: పాన్ ఇండియా మూవీలో సమంత… “యశోద” గా టైటిల్ ఖరారు