భారత్ లో వేల సంఖ్యలో మరణిస్తున్న పక్షులు.. విజృంభిస్తోన్న ఆ వ్యాధి..?

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గినా ప్రజల్లో భయాందోళన ఏ మాత్రం తగ్గలేదు. కొత్త ఏడాదిలో అయినా వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇబ్బందులు ఉండవని భావించిన ప్రజలను వేల సంఖ్యలో పక్షుల మృతి టెన్షన్ పెడుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం ఇటీవల పక్షులు మృత్యువాత పడ్డాయి. […]

Written By: Navya, Updated On : January 5, 2021 5:05 pm
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం గతంతో పోలిస్తే కొంతవరకు తగ్గినా ప్రజల్లో భయాందోళన ఏ మాత్రం తగ్గలేదు. కొత్త ఏడాదిలో అయినా వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇబ్బందులు ఉండవని భావించిన ప్రజలను వేల సంఖ్యలో పక్షుల మృతి టెన్షన్ పెడుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం ఇటీవల పక్షులు మృత్యువాత పడ్డాయి.

Also Read: బర్డ్‌ ఫ్లూ కలకలం

పలు రాష్ట్రాల్లో పక్షుల మిస్టరీ డెత్ కు బర్డ్ ఫ్లూ కారణమని ప్రాథమికంగా తెలుస్తుండగా మిగిలిన రాష్ట్రాల్లో కారణాలు తెలియాల్సి ఉంది. చనిపోవడానికి ముందు పక్షులు వింతగా ప్రవర్తించాయని అక్కడి స్థానికులు చెబుతుండటం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అటవీశాఖ మంత్రి పక్షుల మృతికి సంబంధించి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.మధ్యప్రదేశ్ లో మూడు రోజుల క్రితం ఇండోర్ లో పదుల సంఖ్యలో పక్షులు మృతి చెందాయి.

Also Read: నదులకు చిల్లర పైసలు, పండ్లను కానుకగా సమర్పించడానికి గల కారణాలు తెలుసా?

శాస్త్రవేత్తలు, వైద్యులు చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వల్లే పక్షులు చనిపోయినట్టు తేలింది. హిమాచల్ ప్రదేశ్ లోని పక్షుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమో కాదో తెలియాల్సి ఉంది. ఇండోర్ లో పక్షుల మృతికి కారణమైన వైరస్ ఒక పక్షి నుంచి మరో పక్షికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండోర్ లో దాదాపు 96 కాకులు చనిపోయాయని సమాచారం.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

దేశంలోని ఫతేపూర్ ప్రాంతంలో కామన్ టీల్, బాతులు కూడా గత నెలలో హఠాత్తుగా మరణించాయి. పక్షులు మృతి చెందుతూ ఉండటంతో పలు ప్రాంతాల్లో అధికారులు బర్డ్ ఫ్లూ ప్రోటోకాల్ ను అమలులోకి తెస్తున్నారు.