కాళ్లు నావి కాదు..చెప్పులు నావి కాదు.. నడిచేది మాత్రం నేనే అన్నట్టుగా తయారైంది ప్రధాని నరేంద్ర మోడీ తీరు.. కేంద్రంలోని చమురు సంస్థలకు విచ్చలవిడిగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించి ఇప్పుడు అవి సామాన్యుడి నడ్డి విరుస్తున్నా ఆ తప్పు వాటిదేనంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ తప్పించుకుంటోంది. భారం మాత్రం ప్రజలపై నెలనెలా భారీగా పడుతోంది.
Also Read: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్
తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ.100కు చేరువవుతోంది. పెట్రోల్ ధరలు కొత్త గరిష్టానికి చేరుతోంది. పైపైకి కదులుతూనే వస్తోంది. డీజిల్ ధర కూడా ఇదే రీతిలో పరిగెడుతోంది. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ధరలు ఇంతకన్నా ఎక్కువ పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
దేశంలో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.90 దాటేసింది. ఈ ధరలు త్వరలోనే దేశంలో రూ.100 వెళ్తాయనే భయం సాధారణ ప్రజలను వెంటాడుతోంది.
ఇక పెట్రో ధరలు పెరగడానికి గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధరల పెరుగుదల కారణం కానేకాదు.. ఇక్కడి ప్రభుత్వాలే పన్నులతో పెంచుతున్నాయి. 2018లో క్రూడ్ ధర 80 డాలర్లు ఉండగా.. అప్పుడు రూ.84 లీటర్ ఉంది. ఇప్పుడు ముడిచమురు ధర 50 డాలర్లు ఉన్నా 100 రూపాయలకు పెట్రోల్ ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: మహా చెడ్డ పాలకుడిగా ముద్ర పడిన ట్రంప్
మోడీ ప్రభుత్వ హయాంలో క్రూడ్ ధరలు కేవలం 50 డాలర్లు మాత్రమే ఉన్నా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటే తప్పు ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోవడమే ఈ ధరాఘానికి కారణంగా.. ఏకంగా ఇందులో 60శాతం పన్నులతోనే ఈ ధర ఇంత భారీగా పెరిగింది.
కేంద్రంలోని మోడీ సర్కార్ 2019 ఆరంభంలో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.19.98 నుంచి ఏకంగా రూ.32.98కి పెంచడంతో కేంద్రం ఖాజానా నిండినా సామాన్యుల నడ్డి మాత్రం విరుగుతోంది. ఏకంగా డబుల్ పన్నులు పెంచి మోడీ సర్కార్ సామాన్యుల జేబులకు గుల్ల పెడుతోంది. ఇప్పటికైనా జర ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలని.. పెట్రో భారం తగ్గించాలని సామాన్యులు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్